ఢిల్లీ స్కూల్‌లో దారుణం.. 11 ఏళ్ల బాలిక‌ను టాయిలెట్‌లోకి లాక్కెళ్లి

11 Year Old Molested by two seniors in school.దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Oct 2022 4:29 AM GMT
ఢిల్లీ స్కూల్‌లో దారుణం.. 11 ఏళ్ల బాలిక‌ను టాయిలెట్‌లోకి లాక్కెళ్లి

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌లు, బాలిక‌పై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది. కేంద్రీయ విద్యాల‌యంలో 11 ఏళ్ల విద్యార్థినిపై ఇద్ద‌రు సీనియ‌ర్లు మ‌రుగుదొడ్డిలో అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న జూలై నెల‌లో జ‌రుగ‌గా సంస్థ నిర్వాహ‌కులు బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త తీసుకున్నారు. ఇటీవ‌ల బాలిక త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

బాలిక త‌ల్లిదండ్రులు తెలిపిన వివ‌రాల ఇలా ఉన్నాయి. బాలిక త‌న త‌ర‌గ‌తి గ‌దికి వెలుతుండ‌గా అనుకోకుండా 11,12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఇద్ద‌రు అబ్బాయిల‌ను ఢీ కొట్టింది. అందుకు క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పింది. అయితే.. వారు బాలిక‌ను తిడుతూ వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లారు. అనంత‌రం త‌లుపులు మూసివేసి త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు బాలిక ఆరోపించింది.

ఈ ఘ‌ట‌న‌ను టీచ‌ర్‌కు తెలుప‌గా.. ఇద్ద‌రు విద్యార్థుల‌ను బ‌హిష్కరించిన‌ట్లు చెప్పార‌ని, ఎక్క‌డా ఈ విష‌యం గురించి మాట్లాడ‌వ‌ద్ద‌ని చెప్పిన‌ట్లు తెలిపింది. ఇటీవ‌ల బాలిక‌ల త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా.. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్.. పోలీసుల‌కు, ప్రిన్సిపాల్‌కు నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ కాపీని, ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి వివ‌రాల‌ను అందించాల‌ని ఆదేశించింది.

ఘ‌ట‌న‌ను పోలీసుల‌కు తెలియ‌కుండా దాచిన టీచ‌ర్‌, ఇత‌ర సిబ్బందిపై తీసుకున్న చ‌ర్య‌ల గురించి స‌మాచారం అందించాల‌ని పాఠ‌శాల అధికారుల‌ను, పోలీసుల‌ను ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్ కోరింది. దేశ రాజ‌ధానిలో పిల్ల‌ల‌కు పాఠ‌శాల‌లు కూడా సుర‌క్షితం కాక‌పోవ‌డం చాలా దుర‌దృష్ట‌క‌రం. ఈ విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి. పాఠ‌శాల అధికారుల పాత్ర‌పై కూడా విచార‌ణ జ‌ర‌పాలని ఆదేశించింది.

Next Story