రాజస్తాన్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం.. 11మంది దుర్మ‌ర‌ణం

11 Dead In Rajastan Accident. రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. నగౌర్‌ జిల్లా బికనీర్‌-జోధ్‌పూర్‌ రహదారిలోని

By Medi Samrat  Published on  31 Aug 2021 7:39 AM GMT
రాజస్తాన్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం.. 11మంది దుర్మ‌ర‌ణం

రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. నగౌర్‌ జిల్లా బికనీర్‌-జోధ్‌పూర్‌ రహదారిలోని శ్రీ బాలాజీ టెంపుల్‌ సమీపంలో మంగళవారం ఉద‌యం ఈ ప్రమాదం సంభవించింది. కారు‌, ట్ర‌క్కు ఢీకొనడంతో 11 మంది మర‌ణించ‌గా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్నారు. గాయ‌ప‌డ్డ‌వారిని బికనీర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ప్ర‌మాదానికి గురైన వారంద‌రిది మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జాయిని జిల్లాగా గుర్తించారు. రాజస్తాన్‌లోని రామ్‌దేవరా కర్నీ మాత దేవాలయాలను దర్శించుకొని తిరిగి ఇంటికి బయల్దేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాజస్తాన్ సీఎం అశోక్‌ గెహ్లట్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మరణించిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.Next Story
Share it