Breaking : ప్రయాగ్‌రాజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తులు దుర్మరణం
ప్రయాగ్‌రాజ్-మీర్జాపూర్ హైవేపై మేజా ప్రాంతంలోని మను కా పురా సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 15 Feb 2025 8:31 AM IST
ప్రయాగ్‌రాజ్-మీర్జాపూర్ హైవేపై మేజా ప్రాంతంలోని మను కా పురా సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 19 మంది గాయపడ్డారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా వాసులు. మహాకుంభంలో స్నానం చేసేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. సంగమ స్నానం అనంతరం భక్తులను తీసుకుని మధ్యప్రదేశ్ బస్సు మిర్జాపూర్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు, బొలెరో మధ్య భారీగా ఢీకొన్నాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా ప్రయత్నించినా మృతదేహాలను బయటకు తీయలేకపోయారు. మృతదేహాలను బయటకు తీసేందుకు గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించారు. ఈ కేసులో బొలెరో, బస్సు ఢీకొన్న ఘటనలో 10 మంది మృతి చెందినట్లు డీసీపీ వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు.ఈ ప్రమాదంపై విచారణ జరుగుతోంది. ఈ ఘటన రాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగిందని వెల్లడించారు.
బొలెరోలో భక్తులను తీసుకుని బస్సు మీర్జాపూర్ వైపు వెళ్తుండగా.. మేజా పోలీస్ స్టేషన్ పరిధిలోని మను కా పురా పెట్రోల్ పంపు ముందు బొలెరో, బస్సు ఢీకొన్నాయి. ఢీకొన్న శబ్ధం పెద్దగా వినిపించడంతో పక్కనే ఉన్నవారు పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం అందించారు. బొలెరోలో ఉన్నవారి మృతదేహాలు వాహనంలో తీవ్రంగా ఇరుక్కుపోయాయి. వాటిని బయటకు తీయడానికి గ్యాస్ కట్టర్లు ఉపయోగించారు.
ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో చాలా మంది మృతదేహాలు బాగా ఛిద్రమయ్యాయి. బ్యాగ్‌లో లభించిన ఆధార్ కార్డుల ఆధారంగా ఇద్దరు మృతదేహాలను ఛత్తీస్‌గఢ్‌లోని జమ్నిపాలి కోర్బా నివాసితులు ఈశ్వరీ ప్రసాద్ జైస్వాల్, సోమనాథ్ దరిన్‌లుగా గుర్తించారు. మిగిలిన వ్యక్తులను గుర్తిస్తున్నారు.