డీసీఎంను ఢీకొట్టిన‌ ఆటో.. 10 మంది దుర్మ‌ర‌ణం

యూపీలోని హర్దోయ్ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు

By Medi Samrat  Published on  6 Nov 2024 4:55 PM IST
డీసీఎంను ఢీకొట్టిన‌ ఆటో.. 10 మంది దుర్మ‌ర‌ణం

యూపీలోని హర్దోయ్ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

కత్రా బిల్హౌర్ హైవేపై రోషన్‌పూర్ సమీపంలో ఆటో, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు, ఒక యువకుడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరజ్ కుమార్ జాదౌన్ కూడా అక్కడికి చేరుకున్నారు. మృతులను ఇంకా గుర్తించలేదు.

Next Story