మినీ బ‌స్సు - ట్ర‌క్కు ఢీ.. 10 మంది మృతి

10 Dead in Moradabad-Agra Highway Accident. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. శ‌నివారం ఉద‌యం

By Medi Samrat  Published on  30 Jan 2021 5:03 AM GMT
మినీ బ‌స్సు - ట్ర‌క్కు ఢీ.. 10 మంది మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. శ‌నివారం ఉద‌యం మోర్దాబాద్ - ఆగ్రా ర‌హ‌దారిపై మినీ బ‌స్సు - ట్ర‌క్కు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న ప‌ది మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 10 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందిన వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న‌ పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డ్డ‌వారిని చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి పంపారు.


ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్.. రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి రూ. 50 వేలు చొప్పున ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని సీఎం యోగి అధికారుల‌ను ఆదేశించారు.


Next Story
Share it