ప్రకాశం: కందుకూరు బూడిదపాలెంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో జహీర్‌ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జహీర్‌ ఉరి వేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. కాగా పోలీసులు వేధింపుల వల్లే తన కొడుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడని జహీర్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భార్య, భర్తల గొడవ విషయంలో పోలీసులు వేధించారని మృతుని బంధువులు అంటున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్‌స్టేషన్‌ ఏఎస్సై, కానిస్టేబుల్‌ అనుచితంగా ప్రవర్తించాడని.. దీంతో మనస్తాపానికి గురై జహీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు కందుకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జహీర్‌ భార్య జరీనా వడ్డీ వ్యాపారం చేస్తోంది. వడ్డీ వ్యాపారంలో జరీనా రూ.10 లక్షలు అప్పు చేసింది. ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతున్నారని భర్త జహీర్‌ భార్య జరీనాను రూ.10 లక్షల విషయమై నిలదీశాడు. భర్తతో గొడవ పెట్టుకున్న జరీనా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు వెళ్లింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తన భర్త కొడుతున్నాడని భార్య జరీనా భర్తపై కేసు పెట్టింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.