నగరంలోని అమెజాన్ గోదాంలో దారుణం..
By అంజి Published on 29 Dec 2019 9:53 PM IST
హైదరాబాద్: నగరంలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌కు చెందిన ఓ గోదాంలో దారుణం జరిగింది. ఇద్దరు ఉద్యోగులు ఘర్షణకు పాల్పడ్డారు. స్టోర్ మేనేజర్‌గా పని చేస్తున్న శివరామ్‌పై డెలీవరీ బాయ్ దాడికి పాల్పడ్డాడు. కాగా దాడిలో శివరామ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. శివరామ్‌ను అక్కడే ఉన్న సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివరామ్ మృతి చెందాడు. నవంబర్ 20వ తేదీన ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. టోలిచౌక్‌లోని అమెజాన్ బ్రాంచ్‌లో శివరామ్ ఎస్‌ఎస్‌ఏగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story