ధోనీ రిటైర్మెంట్ పై సచిన్, సెహ్వాగ్, పీటర్సన్, వసీం అక్రమ్ ఏమన్నారంటే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Aug 2020 4:19 AM GMTమహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించిన ధోనీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం అతడి అభిమానులకు ఓ రకంగా షాకింగ్ విషయమే..! ధోని రిటైర్మెంట్ పై పలువురు క్రికెటర్లు స్పందించారు.
భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోని చేసిన సేవను ఎప్పటికీ మరిచిపోలేమని.. 2011 ప్రపంచ కప్ ను కలిసి గెలిచిన క్షణం నా జీవితంలో మరచిపోలేని సంఘటన అని సచిన్ టెండూల్కర్ మహేంద్ర సింగ్ తో కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. నీ లైఫ్ లోని సెకండ్ ఇన్నింగ్స్ కు శుభాకాంక్షలు అని తెలిపారు సచిన్.
ధోని రిటైర్మెంట్ పై రవి చంద్రన్ అశ్విన్ స్పందించాడు. మహీభాయ్ తనదైన స్టైల్ లోనే రిటైర్మెంట్ ను ప్రకటించాడని.. దేశం కోసం అన్నీ చేసాడని చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, 2011 వరల్డ్ కప్, చెన్నై ఐపీఎల్ టైటిల్స్ నెగ్గడం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అశ్విన్ ట్వీట్ చేశాడు.
మహేంద్ర సింగ్ ధోని ఒక్కడే.. తన స్నేహితుడు, పెద్దన్న, ఇన్స్పిరేషన్.. బ్లూ జెర్సీలో నీతో కలిసి ఆడడాన్ని మిస్ అవుతున్నా.. నాకోసం నువ్వు ఎప్పుడూ ఉంటావు.. నన్ను గైడ్ చేస్తూ ఉంటావని ఆకాంక్షిస్తానని హార్దిక్ పాండ్యా ఇంస్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడు.
అలాంటి ప్లేయర్ ఉంటే ఏ మిషన్ కూడా ఇంపాజిబుల్ కాదు. ఎంఎస్ ధోని లా ఎవరూ లేరు.. ఎవరూ ఉండరు.. ఎవరూ రారు.. ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఎవరు కూడా ధోని అంత సెన్సిటివ్, ప్రశాంత ఉన్న వాళ్ళు రారు అని వీరేంద్ర సెహ్వాగ్ పోస్టు పెట్టారు.
గ్రేట్ లీడర్, గ్రేట్ ఫినిషర్.. అలాగే గొప్ప మనిషి ధోని భాయ్.. మధురస్మృతులకు చాలా ధన్యవాదాలు అని ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్ తెలిపాడు.
మహేంద్ర సింగ్ ధోని గొప్ప క్రికెటర్ అంటూ పాకిస్థాన్ క్రికెటర్ వసీం అక్రమ్ కొనియాడారు. వచ్చామా.. ఆడామా.. సాధించామా.. అన్నది ధోని సిద్ధాంతం. భారత్ కు టీ20 వరల్డ్ కప్, వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు.. ప్రత్యర్థులంటే భయపడని అతడి డేరింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టమని అన్నారు.
రిటైర్మెంట్ క్లబ్ లోకి స్వాగతం మహేంద్ర సింగ్ ధోని.. గొప్ప మేజికల్ కెరీర్ అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.
పలువురు క్రికెటర్లు ధోని రిటైర్మెంట్ పై సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.
�
�
�
�
�
�