భారత్‌లో ఓమిక్రాన్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని మహారాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి అన్నారు. మరో ఆరు వారాల్లో భారత్‌లో ఓమిక్రాన్ పతనాన్ని చూడవచ్చన్నారు. ఇది ఆందోళన, జాగ్రత్తకు కారణం అయితే భయపడాల్సిన అవసరం లేదని శశాంక్ పేర్కొన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా ఓమిక్రాన్ కేసులేనని. జీనోమ్ సీక్వెన్సింగ్ 80 శాతం కేసులలో ఓమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయని చెప్పారు.
ఇది ఖచ్చితంగా డెల్టా కాదని.. ముంబైలో మూడో వేవ్ మొదలైందన్నారు. ముంబైలో గడిచిన 24 గంటల్లో 2500కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, దీంతో రోజు 10 వేలకుపైగా కేసులు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్ శశాంక్ జోషి చెప్పారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించాలని సూచించారు. ఫ్లూలాగా లాగా లేదా సాధారణ జలుబు లాగా ఓమిక్రాన్ వ్యాప్తిస్తోందని తెలిపారు. వెన్నునొప్పి, తలనొప్పి, అలసట, ముక్కు కారటం, గొంతు నొప్పి ఓమిక్రాన్ లక్షణాలు.