వీధికుక్కపై డ్రగ్స్ బానిస అత్యాచారం.. ఢిల్లీలో మరో ఘటన

ఢిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలోని జేజే కాలనీలో నివసిస్తున్న ఓ వ్యక్తి వీధికుక్కపై అత్యాచారం చేశాడు.

By అంజి  Published on  6 March 2023 7:28 AM IST
Delhi , stray dog, Indrapuri

వీధికుక్కపై డ్రగ్స్ బానిస అత్యాచారం (ఫైల్‌ ఫొటో)

ఢిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలోని జేజే కాలనీలో నివసిస్తున్న ఓ వ్యక్తి వీధికుక్కపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంద్రపురి ప్రాంతంలో గడిచిన 10 రోజుల్లో ఇది రెండో ఘటన. ఇంద్రపురి జేజే కాలనీ బి బ్లాక్‌లో నివాసముంటున్న రాజేష్, పక్క ఇంట్లో ఉంటున్న సతీష్ అనే వ్యక్తిపై ఇంద్రపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 28న ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా కుక్క ఏడుపు వినిపించిందని రాజేష్ ఫిర్యాదు చేశాడు.

తనిఖీకి వెళ్లి చూడగా సతీష్‌ ఓ చేతిలో వైపర్‌ పట్టుకుని కుక్కపై అత్యాచారం చేస్తూ కనిపించాడు. అందుకు నిదర్శనం కోసం రాజేష్ వీడియో రూపొందించాడు. అలాగే సతీష్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని ఫిర్యాదుదారు తెలిపారు. రాజేష్ కుక్క క్రూరత్వానికి సంబంధించిన వీడియోను పోలీసులకు అందించాడు. ఆ తర్వాత ఇంద్రపురి పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 377 మరియు 11 యానిమల్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఢిల్లీలో కొద్దిరోజుల క్రితం ఓ వీధికుక్కపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశ రాజధానిలోని హరి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆ ప్రాంతంలోని ఓ పార్కులో కుక్కపై అత్యాచారం జరిగింది.

Next Story