భారత్‌లో 15లక్షలు దాటిన కరోనా కేసులు
By తోట వంశీ కుమార్ Published on 29 July 2020 11:21 AM ISTభారత్‌లో కరోనా విలయం కొనసాగుతోంది. 15లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత కొద్ది రోజులుగా నిత్యం 40వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 48,513 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 768 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 15,31,669 కి చేరింది. ఈమహమ్మారి భారీన పడి 34,193 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read
మరోసారి లాక్డౌన్ పొడిగింపుమొత్తం నమోదు అయిన కేసుల్లో 9,88,029 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 5,09,447 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజులో 4,08,855 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తం 1,77,43,740 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో కరోనా మరణాల రేటు 2.25శాతంగా ఉండగా.. రికవరీ రేటు 64.24 శాతంగా ఉంది.
Next Story