మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు

By సుభాష్  Published on  29 July 2020 1:30 AM GMT
మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనా కట్టడి కోసం మరిన్ని చర్యలకు దిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వారంలో రెండు రోజుల పాటు పాటిస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు మమతా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆగస్టు 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.

అలాగే లాక్‌డౌన్‌ నేపథ్యంలో సికింద్రాబాద్‌ నుంచి వెళ్లిన ఫలక్‌నుమా ఎక్స్‌ ప్రెస్‌ను ప్రస్తుతం భువనేశ్వర్‌లో నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. రేపు భువనేశ్వర్‌ నుంచి బయలుదేరనున్నట్లు తెలిపింది.

కాగా, బెంగాల్‌లో నిన్న ఒక్క రోజే 2112 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోపా పాజిటివ్‌ కేసుల సంఖ్య 70వేల వరకు చేరుకుంది. వీరిలో 40వేల మంది వరకు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 1400 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Next Story