భారత్‌లో 24 గంటల్లో 48,916 కేసులు.. 757 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 25 July 2020 5:29 AM GMTభారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 48,916 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 757 మంది మృత్యువాత పడ్డారు. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 13,36,861కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 8,49,432 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 4,56,071 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి భారీన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 31,358కి చేరింది. నిన్న ఒక్కరోజులోనే 4,20,898 పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 3,57,117 కేసులు నమోదు కాగా.. 13,132 మంది మరణించారు. ఇక తమిళనాడులో 1,99,749 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3320 మరణాలు సంభవించాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలో 1,28,389 కేసులు, 3777 మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌లో మూడవ స్థానంలో ఉండగా.. అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో ఆరవ స్థానంలో కొనసాగుతోంది.