ఆన్‌లైన్‌ ఫుడ్‌పై స్విగ్గీ సర్వే.. బిర్యానీకే మొదటి స్థానం

By సుభాష్  Published on  25 July 2020 3:37 AM GMT
ఆన్‌లైన్‌ ఫుడ్‌పై స్విగ్గీ సర్వే.. బిర్యానీకే మొదటి స్థానం

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనాను కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక మూడు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఎలాంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీసులను అనుమతించలేదు. కానీ లాక్‌డౌన్‌ సడలిస్తూ ఆన్‌లైన్‌ ఫుడ్‌కు అనుమతి ఇవ్వడంతో ఆర్డర్లు ఊపందుకున్నాయి. మూడు నెలలపాటు బిర్యానీ లేక అల్లాడిపోయారు.

ఆన్‌లైన్‌ ఫుడ్‌కు అలవాటు పడిన వారు లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోవడంతో బిర్యానీ ప్రయులు గబరా పడిపోయారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌పై స్విగ్గీ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆహార ప్రియులు బిర్యానీ ఆర్డర్‌కే ఎక్కువగా మొగ్గు చూపారు. దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన వాటిలో బిర్యానీకే మొదటి స్థానం దక్కడం విశేషం. స్విగ్గీ నివేదిక ప్రకారం.. బిర్యానీ కోసం దాదాపు 5.5లక్షల ఆర్డర్లు రావడం గమనార్హం. రెండో స్థానంలో బటర్‌ నాన్‌ రోటీ, 3.31 లక్షలతో మసాలా దేశ మూడో స్థానంలో ఉంది. కాగా, వరుసగా నాలుగో ఏడాది అత్యధికంగా ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ లో బిర్యానీ మొదటి స్థానంలో నిలిచింది.

Next Story