Fact Check : అమెరికా తయారుచేసిన బయో వెపన్ 'కోవిద్-19' అని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెప్పారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Aug 2020 3:58 PM IST“Coronavirus is a Lab-engineered Bioweapon” కరోనా వైరస్.. ల్యాబ్ లో తయారు చేసిన బయో వెపన్ అంటూ ఓ వీడియో ఫేస్ బుక్ లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు కోవిద్-19ను మనుషులే ల్యాబ్ లో తయారు చేశారని ఓ స్టడీలో తెలిసింది.
అదే వీడియోను పలువురు తమ తమ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ వచ్చారు.
కోవిద్-19 ఎంతో ప్రమాదకరమైనదని.. అమెరికా ప్రభుత్వం ఈ బయో వెపన్ ను తయారు చేసిందని ఆ వీడియో థంబ్నైల్ లో ఉంచారు.
నిజ నిర్ధారణ:
అమెరికా ప్రభుత్వం కరోనా వైరస్ ను తయారు చేసిందంటూ ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు చెప్పారన్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.
ఈ వీడియోలో ఉన్నది బెన్ స్వాన్ అనే అమెరికన్ టెలివిజన్ న్యూస్ యాంకర్, ఇంటర్వ్యూవర్. Truth In Media అనే వెబ్సైట్ ను ఆయన నడుపుతూ ఉన్నారు. చాలా విషయాలపై ఆయన మాట్లాడారు.
ఈ వీడియో జులై 16, 2020న వెబ్సైట్ లో పబ్లిష్ చేశారు. “TRUTH IN MEDIA WITH BEN SWANN, EPISODE 30: MULTIPLE SCIENTISTS: C0R0NAVLRUS ALTERED IN LAB TO BETTER ATTACH TO HUMANS” అనే వీడియోలో ప్రొఫెసర్ నికోలాయ్ పెట్రోవ్స్కీ మాట్లాడారు. ఆస్ట్రేలియాకు చెందిన స్కై న్యూస్ ఛానల్ లో మాట్లాడారు.
నావల్ కరోనా వైరస్ మీద రీసర్చ్ చేసిన ప్రొఫెసర్ నికోలాయ్ పెట్రోవ్స్కీ స్కై న్యూస్ తో మాట్లాడారు. కరోనా వైర్సా ను జెనెటికల్లీ రూపొందించారని.. అది మనుషుల సెల్స్ తో కలిపి ఉంచారని అన్నారు. ప్రొఫెసర్ నికోలాయ్ పెట్రోవ్స్కీ టీమ్ దీనిపై పూర్తీ రీసర్చ్ చేశామని చెబుతోంది. కరోనా వైరస్ పుట్టుకొచ్చిన సమయంలోనే వాటి మీద అంచనాకు వచ్చారు. మనుషుల్లోని “ACE2” తో ఈ కరోనా వైరస్ జత కలిసే అవకాశం ఉందని వారి స్టడీలో చెప్పుకొచ్చారు. ఈ వైరస్ ను ల్యాబ్ లో తయారు చేశారని తాము బలంగా నమ్ముతూ ఉన్నట్లు ఈ స్టడీలో వారు తెలిపారు.
స్కై న్యూస్ సంస్థ కు ప్రొఫెసర్ నికోలాయ్ పెట్రోవ్స్కీ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ వైరస్ ను ల్యాబ్ లో తయారుచేశారని అభిప్రాయపడ్డారు. 'సెల్ కల్చర్ ఎక్స్పెరిమెంట్' చేస్తున్న సమయంలో చోటుచేసుకున్న పొరపాటు వలనే కరోనా వైరస్ పుట్టుకొచ్చిందని ఆయన అన్నారు. తాము పరీక్షలు చేసింది ఈ వైరస్ ఆరిజిన్ తెలుసుకోవడం కోసమేనని అన్నారు. అంతేకానీ ఎటువంటి పొలిటికల్ అజెండా లేదని స్పష్టం చేశారు.
AAP Fact check కూడా ఇది అబద్ధపు పోస్టు అంటూ కొట్టివేసింది.
ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు కరోనా వైరస్ ను ల్యాబ్ లో మనుషులే తయారు చేసి ఉండవచ్చు అని చెప్పారు కానీ.. బయో వెపన్ లాగా వాడడానికి తయారు చేయలేదని చెప్పారు. అమెరికా ప్రభుత్వం కరోనా వైరస్ ను తయారు చేసిందంటూ ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు చెప్పారన్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.