రష్యాలో ప్రళయం.. భారత్‌లో ఉగ్రరూపం
By తోట వంశీ కుమార్ Published on 24 April 2020 10:09 PM IST
చైనాలోని వుహన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారికి ఇప్పటి వరకు మందు లేదు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ఇప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. అయిన్పప్పటికి కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 27,66,184 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,93,779 మంది మృత్యువాత పడ్డారు.
భారత్‌లో 24 గంటల్లో 1,752 ..
ఇక మనదేశంలో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,752 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 23,452కి చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి భారీన పడి 724 మంది మరణించారు. మొత్తం నమోదైన కేసుల్లో శుక్రవారం సాయంత్రానికి 4,813 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 17,915 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 394 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో 6,817కి కొవిడ్-19 కేసుల సంఖ్య చేరింది. 310మంది మృత్యువాత పడ్డారు. మహరాష్ట్ర తరువాత గుజరాత్ 2,815, ఢిల్లీ 2,514, రాజస్థాన్ 2,034, మధ్యప్రదేశ్ 1,852, తమిళనాడు 1,683, ఉత్తరప్రదేశ్‌లో 1,604 లలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.
రష్యాలో 24 గంటల్లో 5,489..
కరోనా మహమ్మారి రష్యాలో విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో రష్యాలో 5,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 68,622 కు చేరింది. ఇక మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 615 మంది మృతి చెందారు. కాగా.. రష్యాలో ఇప్పటి వరకు 2.5 మిలియన్ల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ మహమ్మారి నియంత్రణకు రష్యా ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ను విధించినప్పటికి.. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.