భార‌త్‌లోనూ మ‌ర‌ణ‌మృదంగం త‌ప్ప‌దా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2020 6:13 AM GMT
భార‌త్‌లోనూ మ‌ర‌ణ‌మృదంగం త‌ప్ప‌దా..?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నిరోధించ‌డానికి ఉన్న ఏకైక మార్గం లాక్‌డౌన్‌. మ‌న‌దేశంతో పాటు ఇప్ప‌టికే చాలా దేశాలు లాక్‌డౌన్ ను విధించాయి. అమెరికా, స్పెయిన్‌, ఇట‌లీ, ప్రాన్స్ వంటి దేశాలు లాక్‌డౌన్‌ను ప‌టిష్టంగా పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల పెను విప‌త్తును ఎదుర్కొంటున్నాయి. మ‌రీ భార‌త్‌లో లాక్‌డౌన్ సంపూర్ణంగా అమ‌లు చేయ‌కుంటే.. సెప్టెంబ‌ర్ నాటికి 111కోట్ల మంది ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డే అవ‌కాశం ఉంద‌ని ప‌లు అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.

మే 3న లాక్‌డౌన్ ఎత్తేస్తే..

భారత్‌లో లాక్‌డౌన్ ఎత్తేస్తే.. కరోనా మరణాలు ఊహించని స్థితిలో పెరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మే 3న లాక్‌డౌన్ ఎత్తేస్తే మే 19 నాటికి దేశంలో దాదాపు 5.35 లక్షల పాజిటివ్‌ కేసులు న‌మోదు అవ్వ‌డంతో పాటు 38,220 కరోనా మరణాలు న‌మోదు కావొచ్చున‌ని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌(జేఎన్‌సీఏఎ్‌సఆర్‌), బెంగళూరు ఐఐఎస్‌, ఐఐటీ బాంబే సంస్థలు ‘కొవిడ్‌-19 మెడ్‌ ఇన్వెంటరీ’ అనే సైంటిఫిక్‌ స్టాటిస్టికల్‌ మోడల్‌ను ఉపయోగించి ఈ అంచనాలను రూపొందించాయి.

సెప్టెంబ‌ర్ నాటికి 111 కోట్ల కేసులు..

ఇక లాక్‌డౌన్‌లో ఇచ్చే మిన‌హాయింపుల వ‌ల్ల భార‌త్ లో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశం ఉందని అమెరికాకు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్‌, డైన‌మిక్స్ అండ్ ఎక‌నామిక్ పాల‌సీ (సీడీడీఈపీ) త‌న నివేదికలో తెలిపింది. భార‌త్‌లో సెప్టెంబ‌ర్ నాటికి 111 కోట్ల మంది ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆ నివేదిక‌లో పేర్కొంది. ఈ లెక్క‌ల‌ను ప్ర‌స్తుత గ‌ణంకాల ప్ర‌కారం వెల్ల‌డిస్తున్నామ‌ని తెలిపింది. వైరస్‌ సోకినప్పటికీ రోగుల్లో లక్షణాలు కనిపించకపోవటం పెద్ద సమస్య అని, దీని వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్‌బారిన పడే ప్రమాదముంద‌ని హెచ్చ‌రించింది.

ఇక‌ గ‌డిచిన 24 గంట్ల‌లో భార‌త్ లో 1684 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 37 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,077కి చేరింది. ఈ వైర‌స్ సోకి ఇప్ప‌టి వ‌ర‌కు 718 మంది మృత్యువాత ప‌డ్డారు. మొత్తం బాధితుల్లో 47,749 మంది కోలుకోగా.. 17,610 మంది బాధితులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story