మే 3 తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించనున్నారా..?

By సుభాష్  Published on  23 April 2020 7:06 AM GMT
మే 3 తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించనున్నారా..?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ భయపెడుతోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపడుతోంది. అయితే ముందుగా ఏప్రిల్‌ 14 వరకు విధించిన లాక్‌డౌన్‌ను తర్వాత మే 3కు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూ ముందుకెళ్తోంది. ఇందుకు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. అయినా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు.

అయితే కరోనా వైరస్‌ తన రూటును మార్చుకుంది. ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. పాజిటివ్‌ ఉన్న ప్రతీ పది మందిలో ఏడుగురికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో కేసుల సంఖ్య వేగంగా పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ విషయం తాజా పరిశోధనలు బట్టబయలైంది. కాగా, మే 3 వరకు లాక్‌డౌన్ మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు అంశాలను చూస్తుంటే లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది.

ముందుగా తెలిపినట్లు ఎయిర్‌ లైన్స్‌కు ఇచ్చిన సూచనల ప్రకారం.. మే 3 తర్వాత డొమెస్టిక్‌ దేశీ ప్రయాణాలు కొనసాగించవచ్చు. జూన్‌ 1 నుంచి విదేశీ ప్రయాణాలకు అనుమతులు ఉంటాయి. కాకపోతే కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వం చెప్పిన మాటలను విని ఎయిర్‌ లైన్స్‌ టికెట్‌ బుకింగ్‌లు మొదలు పెట్టాయి.

కాగా, తాజాగా టికెట్‌ బుకింగ్స్‌ నిలిపివేయాలంటూ సూచనలు చేస్తోంది కేంద్రం. విమాన సర్వీసుల్లో టాప్‌ అయిన ఇండిగో జూన్‌ 1 నుంచి టికెట్‌ బుకింగ్స్‌ను ప్రారంభించనుంది. సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌, మలేషియా ఎయిర్ లైన్స్‌, ఎయిర్‌ ఇండియా తదితర విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణాలు సైతం నిలిపివేయాలంటూ సూచనలు వస్తున్నా పట్టించుకోవడం లేదు.

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ భేటీ

కాగా, మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ కానున్నారు. ఏప్రిల్‌ 27న జరగనున్న ఈ భేటీలో మోదీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. అంతేకాదు మే నెలాఖరు వరకూ పొడిగింపు ఉండే అవకాశాలున్నాయని రూమర్లు వినిపిస్తున్నాయి.

దేశంలో కనీసం వారం రోజుల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గితే లాక్‌డౌన్‌ నుంచి సడలింపు ఉంటుందని భావించాలి. కాని రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో దేశానికి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఈ సమయంలో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున విజృంభించే అవకాశాలున్నాయి. ఇన్ని రోజులు పాటించిన జాగ్రత్తలు వృధా అవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరి మే 3 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా..? లేక పొడిగిస్తారా.? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story