శాస్త్ర‌వేత్త‌లు ఫిబ్రవరిలోనే ప్ర‌భుత్వాన్ని అల‌ర్ట్ చేశారా..?‌ అలసత్వమే చేటు చేయబోతోందా.?

By Kumar Sambhav Shrivastava  Published on  24 April 2020 3:34 AM GMT
శాస్త్ర‌వేత్త‌లు ఫిబ్రవరిలోనే ప్ర‌భుత్వాన్ని అల‌ర్ట్ చేశారా..?‌ అలసత్వమే చేటు చేయబోతోందా.?

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అరికట్టడానికి భారత ప్రభుత్వం సొంత శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను పట్టించుకోకుండా సమయాన్ని వృధా చేసిందని తెలుస్తోంది. 'ఆర్టికల్ 14' ప్రభుత్వ అధికారుల ఇంటర్నల్ మీటింగ్ కు సంబంధించిన సమాచారాన్ని సేకరించి.. పలు విషయాలను బయటపెట్టింది.

'యాక్షన్ తీసుకుంటేనే ప్రతి ఒక్కటీ అదుపు లోకి వచ్చే అవకాశం ఉంటుంది' ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ లో మెడిసిన్ విభాగానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్న నవనీత్ విగ్ చెప్పిన మాటలివి. 29 మర్చి 2020న కోవిద్-19 మహమ్మారిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'టాస్క్ ఫోర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్' మీటింగ్ లో నవనీత్ విగ్ చేసిన వ్యాఖ్యలివి. 'చర్చ అన్నది చాలా దూరం వెళ్ళింది.. కానీ ఇప్పటి వరకూ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు..అంతేకాదు ప్రజలకు కూడా నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది'.. 'మనం ముంబై, పూణే, ఢిల్లీ, బెంగళూరు ప్రజలకు వాళ్ళ చుట్టుపక్కల ఏమేమి జరుగుతోందో తెలియజేయాలి.. వారికే చెప్పలేకపోతే 700 జిల్లాల ప్రజలకు ఏమి చెప్పగలం?' మరో టాస్క్ ఫోర్స్ మెంబర్ అదే మీటింగ్ లో చెప్పిన మాటలివి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత ఢిల్లీలోని ఆల్ ఇండియన్ మెడికల్ సైన్సెస్ లో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ మీటింగ్ లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసర్చ్(ఐ.సి.ఎం.ఆర్.) లో ఎపిడెమియోలజీ అండ్ కమ్యూనల్ డిసీజ్ డివిజన్ హెడ్ రామన్ గంగఖేడ్కర్ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వానికి చెందిన టాప్ సైంటిఫిక్ ఏజెన్సీ నిర్వహించిన సమావేశంలో ప్రముఖ మెడికల్ ఎక్స్పర్ట్స్ కూడా పాల్గొన్నారు.

ఆర్టికల్ 14 సంపాదించిన సమాచారం ప్రకారం ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా లాక్ డౌన్ ను అమలు చేసిందని, అలాగే టెస్టింగ్ ప్రోటోకాల్స్ ను ఉపయోగించి కరోనా వైరస్ సోకిన వారిని ట్రాక్ కూడా చేయలేకపోయిందని తెలుస్తోంది. ముఖ్యంగా మీటింగ్ లో పాల్గొన్న వారందరూ అయోమయంలో ఉన్నారని.. సలహాలు, సూచనలు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకోకుండా సరైన యాక్షన్ ను తీసుకోలేదని చెబుతున్నారు. సైంటిస్ట్స్ చెప్పిన విషయాలను కూడా లాక్ డౌన్ ను అమలు చేసే సమయంలో పట్టించుకోలేదని ఆ మీటింగ్ లో తేలింది. బలవంతంగా లాక్ డౌన్ ను అమలు పరచడం కంటే 'కమ్యూనిటీ, సివిల్ సొసైటీ, సెల్ఫ్ మానిటరింగ్' ద్వారా వైరస్ వ్యాప్తిని ఆపవచ్చని.. 2020 ఫిబ్రవరిలో సైంటిస్ట్స్ చేసిన రీసర్చ్ ద్వారా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చారు.

ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుండా ఉంటే వైరస్ విపరీతంగా ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు. టెస్టింగ్ ల సంఖ్యను పెంచాలని.. క్వారెంటైన్ సదుపాయాలను పెంచాలని శాస్త్రవేత్తలు సూచించారు. వైద్య సిబ్బందికి సరైన రక్షణ కూడా కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం చాలా ఆలస్యంగా శాస్త్రవేత్తల సూచనలను పరిగణ లోకి తీసుకుంది.

ఒక నెల పాటూ వారు చేసిన రీసర్చ్ ను పట్టించుకోకుండా.. అనూహ్యంగా నాలుగంటే నాలుగు గంటల్లో లాక్ డౌన్ ను ప్రకటించేశారు. చాలా మంది ఎక్కడికి పోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో నిలిచిపోయారు.

మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు వినోద్ కె.పాల్. ఈయన నీతి ఆయోగ్ లో కూడా సభ్యుడే. భారత్ లో సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్మిషన్) లేదని తెలిపారు. మోదీ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం కారణంగా ఆర్థికంగా కష్టాలు తప్పవని, కొన్ని విషయాల్లో నొప్పి బాధ అన్నవి ఉంటాయని తెలిపారు. లాక్ డౌన్ సమయాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుని అన్ని సదుపాయాలను రెడీగా పెట్టుకోవాలి.

జ్వరం, దగ్గు లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పాల్ ఇచ్చిన ప్రెజెంటేషన్ ప్రకారం భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలివే:

*గడప గడపకు వెళ్లి పేదలకు కావాల్సిన నిత్యావసరాలను అందించాలి.

*ప్రతి ఒక్క జిల్లాలోని కోవిద్-19 కు సంబంధించిన ఇన్ఫెక్షన్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి.

*'వేగవంతమైన రిపోర్టింగ్' ద్వారా క్వారెంటైన్ సదుపాయాలపై ఓ అంచనాకు రావచ్చు.

*మురికివాడల్లో నివసించే వాళ్లకు సెంట్రల్ క్వారెంటైన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం, మిగిలిన వాళ్ళను హోమ్ క్వారెంటైన్ లో ఉంచవచ్చు

*యుద్ధప్రాతిపదికన ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ , హాస్పిటల్ బెడ్స్ ను పెంచుకుంటూ వెళ్ళాలి.

పాల్ చెప్పిన విషయాలు మరీ కొత్తవేమీ కావు. ఫిబ్రవరిలో ప్రభుత్వానికి శాస్త్రవేత్తలు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా ఈ విషయమే ఉంది. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకరిని క్వరెంటైన్ సెంటర్ కు.. అది కూడా 48 గంటల్లోపే తరలిస్తే వైరస్ సోకడాన్ని 62 శాతం వరకూ తగ్గించవచ్చు. భారత్ లో వైరస్ కేసులు ఎక్కువగా ప్రబలకుండా ఈ పద్ధతి చాలా వరకూ మంచి ఫలితాలను తీసుకుని వస్తుందని అన్నారు. కానీ ప్రభుత్వానికి ఈ సలహాలు వంటపడడానికి దాదాపు నెల రోజులు పట్టింది.

ఆర్టికల్ 14 చాలా విషయాలకు సంబంధించి హెల్త్ మినిస్ట్రీకి, ఐ.సి.ఎం.ఆర్. కు మెసేజీలు పెట్టింది. అయినప్పటికీ ఎటువంటి సమాధానం తిరిగిరాలేదు. ఎవరూ స్పందించలేదు.

ఒక్కో విషయం ఎప్పుడెప్పుడు జరిగింది:

ఫిబ్రవరి: రీసర్చ్-వార్నింగ్స్

జనవరి 30న భారత్ లో మొదటి కరోనా కేసు బయట పడగా.. అంతకు ముందే జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ గురించి ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఐసిఎంఆర్ శాస్త్రవేత్తలు, ఇతర ఆర్గనైజేషన్స్ లో పని చేసే అధికారులు కలిసి భారత్ లో కరోనా వైరస్ వ్యాపిస్తే తీసుకోవాల్సిన చర్యలపై తమ రీసర్చ్ ను మొదలు పెట్టారు.

ఫిబ్రవరి ఆఖరు వారానికి రెండు పేపర్లను వాళ్ళు రెడీ చేశారు. ఒకటి రివ్యూ పేపర్ కాగా.. మరొకటి మోడలింగ్ ఎక్సర్సైజ్ కు చెందినది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ ఈ పేపర్లను ప్రచురించింది కూడా. రెండు పేపర్లు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయి.

మొదటి పేపర్ అయిన “The 2019 novel coronavirus disease (COVID-19) pandemic: A review of the current evidence” కు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసర్చ్ సభ్యులైన ప్రణబ్ ఛటర్జీ, అనూప్ అగర్వాల్, స్వరూప్ సర్కార్, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీకి చెందిన నాజియా నాగి, ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ కు చెందిన భభతోష్ దాస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు చెందిన శయంతన్ బెనర్జీ, ఐసిఎంఆర్ కు చెందిన నివేదిత గుప్తా, రామన్ ఆర్. గంగఖేడ్కర్ కో- ఆథర్స్ గా ఉన్నారు.

చైనాలో పెట్టిన లాక్ డౌన్ ను భారత్ పాటించడం కంటే.. శాస్త్రవేత్తలు సూచించినట్లుగా క్వారెంటైన్ లలో ఉంచడం, సెల్ఫ్ క్వారెంటైన్ వంటివి పాటించడం ద్వారా కోవిద్-19 వైరస్ ను చాలా వరకూ ఆపవచ్చు.

Image2 1

ఇక రెండో పేపర్ “Prudent public health intervention strategies to control the coronavirus disease 2019 transmission in India: A mathematical model-based approach” కు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసర్చ్ కు చెందిన సందీప్ మండల్, అనూప్ అగర్వాల్, అమర్త్య చౌధురీ, స్వరూప్ సర్కార్, ఐసిఎంఆర్ కు చెందిన తరుణ్ భట్నాగర్, మనోజ్ ముర్హేకర్, రామన్ ఆర్. గంగఖేడ్కర్, ఇంపీరియల్ కాలేజ్ లండన్ కు చెందిన నిమలన్ అరిణమిపతి కో- ఆథర్స్ గా ఉన్నారు.

సెకండ్ పేపర్ లో భారత్ లోని సుప్రసిద్ధ నగరాలైనటువంటి ఢిల్లీ, కలకత్తా, ముంబై, బెంగళూరులలో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుంది అన్నదానిపై అంచనా వేసింది. కరోనా అన్నది విపరీతంగా పెరగడం మొదలైతే ఒక్క ఢిల్లీ లోనే 1.5 లక్షల కేసులు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. కోవిద్-19 లక్షణాలు కనిపించగానే క్వారెంటైన్ కు 48 గంటల్లో వెళ్ళిపోతే 62శాతం వరకూ వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని తెలిపారు.

Image2 2

ఐసిఎంఆర్ సైంటిస్టులు ఎవరైతే రెండు పేపర్ల విషయంలో పనిచేశారో(సర్కార్, గంగఖేడ్కర్ గుప్తా, ముర్హేకర్, భట్నాగర్) వారిని కోవిద్-19 నిర్మూలకు తీసుకోవాల్సిన చర్యలకు ఏర్పాటు చేసిన 21 మందితో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్స్ టీమ్ లో సభ్యులు. సర్కార్ ఐసిఎంఆర్ కు చైర్మన్ కాగా, గంగఖేడ్కర్ నేషనల్ టాస్క్ ఫోర్స్ లో కీలక వ్యక్తి. న్యూ ఢిల్లీలో కరోనా వైరస్ గురించి వార్తలు వెలువరించే సమయంలో ఆయన మీడియా కంట చాలాసార్లే పడ్డాడు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అన్నది క్వారెంటైన్ లేదా సోషల్ ఐసోలేషన్ కు సంబంధం లేదని.. భారత్ లో కొన్ని ప్రాంతాల వ్యక్తులకు ముఖ్యంగా పై అంతస్థుల్లో నివసించే వాళ్ళకే సోషల్ ఐసోలేషన్ అన్నది సాధ్యపడుతుందని.. ఇది కొంత వరకూ మాత్రమే వైరస్ వ్యాప్తిని ఆపగలదని ఓ కో ఆథర్ అభిప్రాయపడ్డారు.

కానీ పేదల విషయంలో చాలా తేడాలు ఉన్నాయని.. వారి విషయంలో ప్రతి ఇంటికీ వెళ్లి టెస్టులు చేయాలని, పాజిటివ్ వచ్చిన వాళ్ళను ఐసోలేషన్ లోకి పంపడమో వంటివి చేయాలని అన్నారు. పేదలు ఉన్న ప్రాంతాల్లో చాలా వరకూ తక్కువ ప్రదేశం మాత్రమే ఉంటుందని.. మరుగుదొడ్లు వంటివి అందరూ కలిసి ఉపయోగిస్తూ ఉంటారని అన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో ఒక్క వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.

కానీ ఫిబ్రవరి నెలలో ఇచ్చిన ఈ రీసర్చ్ రిపోర్టులను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.

మార్చి: టాస్క్ ఫోర్స్-లాక్ డౌన్

మార్చి 18న ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాక్స్ ఫోర్స్ టీమ్ నీతీ ఆయోగ్ మెంబర్ పాల్ తో భేటీ అయ్యింది. ఆ తర్వాత మార్చి 24 న భారత ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ ను అమలు చేశారు.

మళ్ళీ నాలుగు రోజుల తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్ మరోసారి భేటీ అయ్యింది.

ఎయిమ్స్ హెడ్ ఆఫ్ మెడిసిన్ అయిన విజ్ ఈ భేటీలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కోవిద్-19 వ్యాప్తిని అరికట్టడానికి సైన్స్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. టాస్క్ ఫోర్స్ ఏమి చేస్తోందో నాకైతే అర్థం కాలేదు.. మనం ఏమి చేసామో చెప్పండి..? ఇప్పటిదాకా ఏమి రూపొందించామో చెప్పండి..? అంటూ విజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ ను ప్రశ్నించాడు. గంగఖేడ్కర్ మాటాడుతూ 'చాలా ముఖ్యమైన ప్రశ్న.. నన్ను అడగకండి.. ఎందుకంటే నేను లీడ్ ను తీసుకోలేదు(నీతీ ఆయోగ్ మెంబర్ పాల్ ఈ టీమ్ కు లీడ్ గా వ్యవహరిస్తున్నాడు.. ఆయనతో పాటూ యూనియన్ హెల్త్ సెక్రెటరీ ప్రీతి సుడాన్, ఐసీఎమ్ఆర్ డైరెక్టర్ జనరల్ భార్గవ ఎవరూ కూడా ఆరోజు మీటింగ్ కు హాజరు అవ్వలేదు) నాది కూడా అదే ప్రశ్న అని చెప్పారు.

మీటింగ్ లో ఒక ఎపిడెమియోలజిస్ట్ మాటాడుతూ 'ప్రస్తుతం ఉన్న సమస్య ఏమిటంటే ప్రజలు డైరెక్ట్ గా ఆసుపత్రులకు రావడం లేదు.. మనం ఎవరికైతే శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉంటాయో వాళ్ళ మీద మాత్రమే నిఘా పెడుతున్నాం.. వారి లోను చాలా తక్కువ మంది ఆసుపత్రులకు వస్తున్నారు. సరైన సమాచారం ఉండాలంటే మనమే ఇళ్లకు వెళ్లి మరీ చూసి రావాలి. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలైన్స్ ప్రోగ్రామ్ అన్నది ప్రతి జిల్లాలోనూ అమలవ్వాలి' అని అన్నారు.

వారి కామెంట్లను బట్టి చూస్తుంటే ప్రభుత్వం మార్చి నెల చివరిలో కూడా వారు చెప్పిన సూచనలను పాటించలేదు. నిఘాను కూడా పెంచలేదు. చాలా మందిలో ఈ లక్షణాలు ఉన్నా ఫ్లూ అనుకుని భావించి చికిత్స తీసుకోడానికి, టెస్టులు చేయించుకోడానికి ముందుకు రావడం లేదని మరో నిపుణుడు అభిప్రాయ పడ్డారు.

టెస్టింగ్ విషయంలో తీసుకునే చర్యల గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయని ఆర్టికల్ 14కు ఎపిడెమోలజిస్ట్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఐసిఎంఆర్ తో జరిపే చర్చల ద్వారా టెస్టింగ్ విషయంలో మరింత క్లారిటీ వస్తుందని ఆయన అన్నారు. అలాగే నిఘా ఎవరు పెడతారు, లాక్ డౌన్ సమయంలో కోవిద్-19 పాజిటివ్ వచ్చిన వాళ్ళను ఆసుపత్రులకు తీసుకుని వెళ్లడం ఎలా అన్నవి చర్చించాల్సి ఉంది. చాలా మంది ఆసుపత్రులకు రావడం లేదని.. కానీ ప్రజల ఆరోగ్యం గురించి ఓ ఐడియా రావడానికి పలు రాష్ట్రాల్లో యాప్స్ ను ప్రవేశపెట్టారని ఓ కమిటీ మెంబర్ తెలిపారు. గంగఖేడ్కర్ మాట్లాడుతూ టెస్టింగ్ అన్నది ప్రోటోకాల్స్ ప్రకారం నిర్వహించడం లేదని అన్నారు. మిగిలిన విషయాలను ఐసిఎంఆర్ డైరెక్టర్ తోనూ, రీసెర్చర్లతోనూ మాట్లాడుతానని అన్నారు.

ఏప్రిల్ : ఫిబ్రవరి రీసర్చ్ ను రివైవ్ చేసిన పాల్

నీతి ఆయోగ్ మెంబర్ పాల్ ఏప్రిల్ మొదటివారంలో మాట్లాడుతూ ప్రభుత్వం సాధ్యమైనంత వరకూ నిరంతరంగా పోరాడుతోందని.. ప్రజల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. రీసెర్చర్లు ఇచ్చిన పేపర్లలో పొందుపరిచిన విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు. ఇంటింటికీ వెళ్లి చెకింగ్ చేయడం వంటి వాటిపై ఆయన కనీసం స్పందించకపోవడం గమనార్హం.

లాక్ డౌన్ ను ఎత్తివేయడం గురించి కూడా మాటాడలేదు పాల్. ఎవరికైతే కోవిద్-19 లక్షణాలు కనిపిస్తూ ఉంటాయో వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారెంటైన్ సెంటర్లలో ఉంటున్నారని.. కొందరు సొంతంగా క్వారెంటైన్ లోనే ఉంటున్నారన్నారు.

శాస్త్రవేత్తలు పలు విషయాలను సూచించి చాలా రోజులే అయింది. లాక్ డౌన్ ను అన్ని ఏర్పాట్లు చేయడం కోసం వాడాలని, నిఘా కూడా పెంచాలని తెలిపారు. కానీ ఏప్రిల్ 14వ తేదీ వచ్చినా కూడా ఇంకా గడప గడపకు టెస్టింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడం ప్రభుత్వం అలసత్వానికి దారి తీస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతి తక్కువ టెస్టింగ్ రేట్ మనం కలిగి ఉన్నాం.. రాబోయే రోజుల్లో ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియాలి. భారత ప్రభుత్వం మే 3న లాక్ డౌన్ ను మరోసారి పొడిగిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

- నితిన్ సేథీ - కుమార్ సంభ‌వ్ శ్రీవాస్త‌వ‌

Next Story