భారత్ లో రాష్ర్టాల వారీగా కరోనా బాధితుల సంఖ్య ఇలా..
By రాణి Published on 13 March 2020 3:41 PM ISTచైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా మహమ్మారి..ఇండియాలోకి కూడా ప్రవేశించింది. దీని ప్రభావంతో ఇండియాలో తొలి కరోనా మరణం కూడా నమోదైంది. కరోనా ప్రభావం సినిమాలపై కూడా పడింది. ప్రతి శుక్రవారం థియేటర్లలో తెలుగు సినిమాలు సందడి చేస్తుంటాయి. కానీ..ఈ శుక్రవారం మాత్రం..సినిమాలు విడుదల లేక థియేటర్లన్నీ వెలవెలబోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆయా సినిమాల బృందాలు వైరస్ వ్యాప్తి తగ్గేంత వరకూ సినిమాలు విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఒలింపిక్స్ వాయిదా ?
మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. ఈ మేరకు యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది. వారం రోజుల పాటు అక్కడి వ్యాపార సంస్థలు, మాల్స్, స్కూళ్లు, సినిమా థియేటర్లన్నింటినీ మూసివేయాలని ప్రకటించింది ప్రభుత్వం.
కాగా..ఇండియాలో ఇప్పటి వరకూ 58 కరోనా కేసులు నమోదవ్వగా..వారిలో 17 మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారున్నారు. ముగ్గురు కోలుకుని ఇళ్లకు చేరగా..ఒకరు కరోనాతో మృతి చెందారు. ఢిల్లీలో 6, హర్యానాలో 14(ఇతర దేశస్తులు), కేరళలో 17 కరోనా కేసులు నమోదవ్వగా ముగ్గురు కోలుకున్నారు. అలాగే రాజస్థాన్ లో 3 కరోనా కేసులు నమోదవ్వగా..వారిలో ఇద్దరు విదేశీయులు. తెలంగాణలో 1, ఉత్తర్ ప్రదేశ్ లో 11 (1 విదేశీ), లఢక్ లో 3, తమిళనాడులో 1, జమ్మూ కశ్మీర్ లో 1, పంజాబ్ లో 1, కర్ణాటకలో 5, మహారాష్ర్టలో 1, ఆంధ్రప్రదేశ్ లో 1 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తానికి భారత్ లో ఉన్న 13 రాష్ర్టాల్లోనూ కరోనా వ్యాపించింది. కాబట్టి ప్రజలు డాక్టర్ల సలహాలు పాటిస్తూ..శానిటైజర్స్..హ్యాండ్ వాష్ లను ఉపయోగించడం శ్రేయస్కరం.
Also Read : అక్కడ కిలో చికెన్ రూ.10 లకే