ఒలింపిక్స్ వాయిదా ?

By రాణి  Published on  13 March 2020 7:18 AM GMT
ఒలింపిక్స్ వాయిదా ?

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు టోక్సో ఒలింపిక్స్ పై కూడా పడింది. కరోనా వైరస్ బాధితులు, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 24 నుంచి ఆగస్ట్ 9వ తేదీ వరకూ జరగనున్న టోక్యో ఒలింపిక్స్ 2020 ను సంవత్సరం పాటు వాయిదా వేయాల్సిందిగా జపాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రభావంతో..ఇప్పటికే క్రికెట్ తో సహా అనేక క్రీడల టోర్నీలు రద్దవుతుండగా..మరికొన్ని వాయిదా పడుతున్నాయి. కొన్నైతే..ప్రేక్షకులు లేకుండానే కొనసాగుతున్నాయి.

Also Read : సోషల్‌ మీడియా ద్వారా పరిచయం.. ప్రేమ, పెళ్లి పేరుతో అత్యాచారం

కాగా..ఈసారి జరిగే ఒలింపిక్స్ లో అమెరికా నుంచి ఎక్కువ మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ టోక్సో అధికారులకు ఒలింపిక్స్ ను వాయిదా వేయాలని సూచించినట్లు సమాచారం.

Also Read : యాభై ఏళ్ల తర్వాత గాళ్ ఫ్రెండ్ ను కలిసిన అమితాబ్..

కెనడా ప్రధాని భార్య సోఫీకి, బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రికి, హాలీవుడ్ దంపతులకు కూడా కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణయింది. దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, బ్రిటన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇరాన్ లో మాత్రం ప్రజలు బయటికి వచ్చేందకు వీలులేదంటూ అక్కడి ప్రజలను గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఇటు భారత్ లో కూడా తొలి కరోనా మరణం సంభవించింది. కర్ణాటకకు చెందిన వ్యక్తి హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందగా..అతడు కరోనా కారణంగానే మృతి చెందినట్లు తెలుస్తోంది.

Also Read : ప్రధాని భార్యకు కరోనా

Next Story