యాభై ఏళ్ల తర్వాత గాళ్ ఫ్రెండ్ ను కలిసిన అమితాబ్..

చాలా ఏళ్ల తర్వాత మనసుపడిన ప్రియురాలిని కలిస్తే ఎలా ఉంటుంది ? సరిగ్గా ఇలాంటి అనుభూతే ఎదురైందట బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి. దాదాపు 50 ఏళ్ల తర్వాత తిరిగి తన గాళ్ ఫ్రెండ్ ను కలిసిన ఆనందాన్ని బిగ్ బి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Also Read : ఉగాదికి ప్రభాస్ ఫస్ట్ లుక్..

ఇంతకీ విషయమేమిటంటే..బచ్చన్ సాబ్ కి కార్లంటే అంతా ఇంతా మోజు కాదు. ఆయన గ్యారేజీలో వెరీ రిచెస్ట్ కార్లు కొలువు దీరి ఉంటాయి. రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ ఆర్నేజ్ ఆర్, మెర్సిడెస్ బెంజ్, ఎస్ ఎల్ 500 రోడ్ స్టర్, మెర్సిడెస్ బెంజ్ వీ క్లాస్ వంటి విలాసవంతమైన కార్లెన్నో ఉంటాయి. అయితే..ఈ కార్లలో తిరుగుతున్నపుడు రాని అనుభూతి..ఓ అభిమాని బహుకరించిన కార్ స్టీరింగ్ తిప్పినపుడు వచ్చిందట. అదే..వింటేజ్ కారు..ఫోర్డ్ ప్రిఫెక్ట్. ట్విట్టర్ ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. అయితే దీని వెనుక ఓ కథ కూడా ఉందట.

Also Read : ప్రధాని భార్యకు కరోనా

బచ్చన్ సాబ్ తన సొంత సంపాదనతో మొదటిసారి మోజు పడి కొన్న కారు ఈ ఫోర్డ్ ప్రిఫెక్ట్. దాని కాలం చెల్లిపోవడంతో..అప్పట్లో ఎవరికో అమ్మేశారట. దానితో ఉన్న అనుబంధం గురించి బిగ్ బి కొన్ని నెలల క్రితం తన ట్విట్టర్ బ్లాగులో రాయగా..అది చూసిన ఓ అభిమాని ఆ కారుకోసం వెతకడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఆ యాభై ఏళ్ల కారుని పట్టుకుని..మెరుగులు దిద్ది..ముస్తాబు చేసి బిగ్ బి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అలాగే అభిమాని పంపిన కారు వద్ద దిగిన ఫొటోను జత చేసి..నా జీవితం అందుకున్న అత్యంత అరుదైన, విలువైన బహుమతి ఇదే..అని ట్వీట్ చేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.