బాహుబలి1,2 సినిమాల ద్వారా పొందిన పేరును..ప్రభాస్ సాహో సినిమా ఫ్లాప్ అవ్వడంతోనే కోల్పోయాడని చెప్పుకోవాలి. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ప్రపంచంలో ఇప్పుడు ప్రభాస్ కు పెద్దగా క్రేజ్ లేదని తెలుస్తోంది. ఫ్లాప్ అయినప్పటికీ సినిమా విడుదల సమయానికి భారీ అంచనాలుండటంతో బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లు వసూళ్లు రాబట్టింది సాహో. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ అయినా ప్రభాస్ ను గట్టెక్కిస్తుందో లేదో చూడాలి. 1970-80లలో యూరప్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా..ఇటీవలే సినిమాకు చెందిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ప్రభాస్ పియానో ముందు నిల్చుని..హీరోయిన్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటుంది.

Also Read : ముగ్గురు పసిపిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..

కాగా..ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం ఉగాది కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే అదేరోజు సినిమా టైటిల్ ను కూడా ప్రకటించే అవకాశాలున్నాయట. ఈ సినిమాకు రాధేశ్యామ్ లేదా ఓ డియర్ అనే పేర్లను పరిశీలిస్తున్నారు. రెండింటిలో ఏదొక టైటిల్ మాత్రం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ తో చేయబోయే సినిమా వివరాలు కూడా త్వరలో అభిమానులకు తెలపనున్నారు ప్రభాస్.

Also Read : కరోనా పై ప్రధాని మోదీ ట్వీట్

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.