ముగ్గురు పసిపిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..

By రాణి  Published on  12 March 2020 12:52 PM GMT
ముగ్గురు పసిపిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..

అమ్మతనం లేని వాళ్లకు పిల్లలు లేరన్న బాధే ఉంటుంది. ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం ఏముంటుంది. దేవుడు కరుణించాలిగా. వీరిది ఒక బాధ అయితే..ఒకరికి ముగ్గురు, నలుగురు పిల్లల్ని వాళ్ల బాధలు రకరకాలుగా ఉంటాయి. కడుపున పుట్టిన పిల్లల్ని పోషించలేకపోతే వారిని పిల్లలు లేని వారికి దత్తత ఇచ్చినా..హ్యాపీగా ఉంటారన్న ఆలోచన కూడా రాదేమో. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఒకరిపై ఒకరికి అనుమానాలు.. ఇలా రకరకాల కారణాలతో పిల్లల్ని చంపేసిన తండ్రులు, పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకున్న తల్లులెందరో ఉన్నారు.

Also Read : టీడీపీ కాలయాపన చేస్తే..వైసీపీ దౌర్జన్యం చేస్తోంది : పవన్ కల్యాణ్

తాజాగా..రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటన చూసిన వారెవరైనా సరే..హృదయం చలించకుండా ఉండదు. కారణమేమిటో తెలీదు గానీ..కన్య(30) అనే మహిళ తన ముగ్గురు పిల్లలు కూతురు లీల(8), కొడుకులు కృష్ణ (6), మొంటు(5)లతో కలిసి గురువారం ఆత్మహత్య చేసుకుంది. అప్పటి వరకూ..బాగానే ఉన్న ఆమె వేగంగా వస్తున్న రైలు ముందుకు పిల్లలతో సహా దూకేసింది. దీంతో ఆ నలుగురూ అక్కడికక్కడే చనిపోయారు. పిండ్వారా-ఫల్నా రైల్వేట్రాక్‌పై జరిగిన ఈ ఘటన చూపరులను కలచివేస్తోంది. దారుణ ఘటనను కళ్లారా చూసిన వారెవరో పోలీసులకు సమాచారమివ్వగా..వారు మృతదేహాలను సిరోహి ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, వారి ఆత్మహత్యలకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :గుడి ఎనక సామి..నగ్నపూజలు

Next Story
Share it