గుడి ఎనక సామి..నగ్నపూజలు

By రాణి  Published on  12 March 2020 5:46 AM GMT
గుడి ఎనక సామి..నగ్నపూజలు

ఈ మధ్య కాలంలో దొంగస్వాములు బాగా ఎక్కువైపోతున్నారు. ఆ స్వాములను నమ్మే జనాలు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఏం చేస్తాం..అంతా కలియుగ మహిమ. ఎవరికైనా పెళ్లైన తర్వాత సంతానం కలుగపోతే ఏ గైనకాలజిస్ట్ నో కలుస్తారు. వాళ్లు చెప్పినట్లుగా మందులు వాడితే..కొన్నాళ్లకు సంతానం కలిగే అవకాశాలుంటాయి. అంతేగాని పూజలు చేస్తేనో..జపాలు చేస్తోనో పిల్లలు పుడతారా ? ఈ ప్రశ్నకు కొంతమంది అవునంటే..మరికొంతమంది కాదని సమాధానాలిస్తున్నారు. కాగా..పెళ్లై ఎన్నాళ్లైనా పిల్లలు పుట్టడం లేదని..ఓ స్వామీజీ వద్దకెళ్లిందో మహిళ. ఫలితంగా అత్యాచారానికి గురైంది.

Also Read : ‘ట్రెండ్‌ సెట్టర్’‌.. సీఎం జగన్‌ను ఫాలో అవుతున్న సీఎంలు ఎవరంటే.!

వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్ రాష్ర్టంలోని ప్రయాగ్ రాజ్ నగరంలో సంజయ్ అనే సాధువు తన ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ మహిళ నిజంగానే పిల్లలు పుడతారని నమ్మి..ఆశ్రమానికి వెళ్లి స్వామీజీని కలిసింది. తన ప్రచారానికి ఫలితం వచ్చిందనుకున్నాడో ఏమో గానీ..దొంగ స్వామీజీ ఆమెపై కన్నేశాడు. తనను అర్థరాత్రి ఒక్కదానివే రావాలని సెలవిచ్చాడు. అతను చెప్పినట్లే మహిళ అర్థరాత్రి స్వామీజీ వద్దకెళ్లింది. పూజలు చేస్తున్నట్లు నటిస్తోన్న ఆ స్వామీజీ..మహిళను నగ్నంగా కూర్చుని ధ్యానం చేయాలని చెప్పాడు. కాస్త అనుమానంగానే..ఆ మహిళ స్వామీజీ చెప్పినట్లు చేసింది. అలా కళ్లు మూసుకోగానే..దొంగ స్వామీజీ కూడా నగ్నావతారమెత్తి..తన కోరిక తీర్చితే సంతానం కలుగుతుందని బలవంతం చేశాడు. అందుకు మహిళ ససేమిరా అనడంతో..ఆమె పై అత్యాచారానికి తెగబడ్డాడు. మోసపోయానని గ్రహించిన మహిళ ఘటనానంతరం పోలీసులకు దొంగ స్వామీజీపై ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :సినీ దంపతులకు కరోనా పాజిటివ్..

Next Story
Share it