'ట్రెండ్‌ సెట్టర్'‌.. సీఎం జగన్‌ను ఫాలో అవుతున్న సీఎంలు ఎవరంటే.!

By అంజి  Published on  12 March 2020 8:37 AM GMT
ట్రెండ్‌ సెట్టర్‌.. సీఎం జగన్‌ను ఫాలో అవుతున్న సీఎంలు ఎవరంటే.!

అమరావతి: వైసీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ వైసీపీ పార్టీ 10వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించుకుంటున్నారు. కాగా వైసీపీ తమ అధికారిక ట్విటర్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉద్దేశిస్తూ ఓ పోస్టు చేసింది. ఈ పోస్టులో పలు అంశాలను వివరించింది. ముఖ్య‌మంత్రి వైఎస్‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఫాలో అవుతున్నారని పేర్కొంది.

పరిపాలనా వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా మూడు రాజధానుల ఏర్పాటుపై జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌, ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ ఆలోచిస్తున్నారని వైసీపీ పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకుచ్చిన ఇంగ్లీష్‌ మీడియాన్ని.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టాలనుకుంటున్నారని పేర్కొంది.

సీఎం జగన్‌ ప్రభుత్వం చేపట్టిన అధికార వికేంద్రీకరణను కర్నాటక సీఎం యడ్యూరప్ప అమలు చేయాలనుకుంటన్నారని తెలిపింది. దిశ చట్టం అమలు గురించి తెలపమి కోరుతూ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ లేఖ రాశారని పేర్కొంది. ఇక మహారాష్ట్రలో దిశ చట్టం అమలు దిశగా సీఎం ఉద్దవ్‌ ఠాక్రే అడుగులు వేస్తున్నారని తెలిపింది.

వైసీపీని స్థాపించి 9 ఏళ్లు పూర్తి చేసుకుని, 10వ సంవ‌త్స‌రంలోకి అడుగిడుతున్న సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, నాయ‌కులంద‌రికీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపింది.విశాఖలో నిర్వహించిన వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొని.. పార్టీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ వైసీపీ ఆవిర్భావ శూభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తల కృషి వల్లే వైసీపీ విజయం సాధించిందన్నారు.

Next Story
Share it