భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. 40లక్షలు దాటిన కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Sept 2020 11:04 AM IST
భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. 40లక్షలు దాటిన కేసులు

భారత్‌లో గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 86,432 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1,089 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో దేశంలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40,23,179కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 31,07,223 మంది కోలుకున్నారు. 8,46,395 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 69,561 మంది మృత్యువాత పడ్డారు.

దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.23శాతం ఉండగా.. మరణాల రేటు 1.73 శాతంగా ఉంది. దేశంలో కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతుండడం ఊరటనిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా నిన్న 10,59,346 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. మొత్తంగా 4,77,38,491 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది.

Next Story