నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కరోనా అనుమానితుడు

By అంజి  Published on  22 March 2020 6:38 AM GMT
నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కరోనా అనుమానితుడు

హైదరాబాద్‌: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కరోనా కలకలం రేపింది. ముంబై ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఓ కరోనా అనుమానితుడిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళహాట్‌కి చెందిన మోసిన్‌ అలీ.. నైజీరియా, లాగోస్‌ నుంచి అబుదాబి మీదుగా విమానంలో ముంబైకి వచ్చాడు. అక్కడి నుంచి ముంబై ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇవాళ ఉదయం నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే మోసిన్‌ చేతిపై హోమ్‌ క్వారంటైన్‌ స్టాంప్‌ ఉండడంతో తోటి ప్రయాణికుడు సాయిరామ్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే మోసిన్‌ అలీని 108 వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మనదేశంలో 14 రోజుల హోమ్‌ క్వారంటైన్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

Also Read: నీటి వాడకంలో అగ్రస్థానం.. భారత్‌లో నీటి కష్టాలు..

తెలంగాణ వ్యాప్తంగా జనత కర్ఫ్యూ కొనసాగుతుంది. తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 14గంటలు కర్ఫ్యూ ఉంటే.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు ప్రజలంతా కర్ఫ్యూ కొనసాగించాలని కోరారు. జనతా కర్ఫ్యూలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పుల్లూరు టోల్‌ గేట్‌ను మూసివేశారు. దీంతో రెండు వైపులా వాహనాలు రెండు కి.మీ నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లో, పట్టణాల్లో 63వేల మంది పోలీసులు, 11వేల మంది హోంగార్డులు జనతా కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల్లోనూ ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

Also Read: దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ

Next Story