విమానయానంలో కరోనా కేర్

By రాణి  Published on  16 March 2020 2:55 PM IST
విమానయానంలో కరోనా కేర్

ఏడాది క్రితం సుప్రసిద్ధ సూపర్ మోడల్ నావోమీ కాంప్ బెల్ విమానం ఎక్కిన తరువాత తన సీటును శుభ్రం చేసుకుని, ముందు సీటు వెనక భాగాన్ని బాగా తుడిచి మరీ కూర్చుంది. దీన్ని ప్రపంచమంతా ఎద్దేవా చేసింది. “సూపర్ మోడల్ కి పరిశుభ్రత పిచ్చి పట్టినట్టుంది” అని ఎగతాళి చేసింది. “మనం చేత్తో తాకే ప్రతి దాన్నీ శుభ్రంగా తుడుచుకోవాలి” అని ఆ మోడల్ చెప్పినా ఎకసెక్కాలు ఎవరూ మానలేదు.

Also Read : ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు చెప్పిన అల్లు అర్జున్

కట్ చేస్తే కరోనా పుణ్యమా అని ఇప్పుడందరూ ఆమె చేస్తున్న పనినే చేస్తున్నారు. విమానాల్లో ఎక్కిన తరువాత సీటుతో సహా అన్నిటినీ శుభ్రం చేసుకుంటున్నారు. విమాన సంస్థలు ఎప్పటికప్పుడు విమానాల్లోపల అంతా తుడిచి శుభ్రం చేసినా ప్రయాణికులు కూడా తమ వంతు శుభ్రతను పాటిస్తున్నారు. ఎందుకంటే విమానం ఒక బహిరంగ ప్రదేశం. అక్కడ అనేక దేశాల ప్రయాణికులు ఉంటారు. ఒక్కరు కరోనా వ్యాధి గ్రస్తులైనా మొత్తం విమానంలో ప్రయాణించే వారందరికీ కరోనా రావచ్చు. అందుకే పలు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

Also Read : అందమైన రిసార్ట్..అందులో హనీమూన్ జంట..ఇంతలోనే షాక్

విమానంలో ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవాలి

  • కూర్చునే సీటును డిసిన్ ఫెక్టెంట్ టిష్యూ పేపర్ తో జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. చేతులు పెట్టుకునే చోట కూడా శుభ్రం చేసుకోవాలి.
  • సీటు ముందు భాగాన్ని ముట్టుకోవద్దు. సీటు లో చేతులు పెట్టుకునే చోటను కూడా అరచేత్తో, వేళ్లతో తాకకూడదు. మురికిగా ఉన్న ఏ ప్రదేశాన్ని ముట్టకూడదు.
  • సాధ్యమైనంత వరకూ విండో సీటును ఎంచుకొండి. విండో సీటు వద్ద కూర్చున్న వారికి ఇతరులకు తాకే అవకాశాలు తక్కువ. కాబట్టి వారికి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
  • విమానంలో ఉండే టచ్ స్క్రీన్ వంటి వాటిని ముట్టాలంటే టిష్యూపేపర్ ను ఉపయోగించండి.
  • చేతులను సానిటైజర్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. చేతులతో ముఖాన్ని తాకకుండా జాగ్రత్త వహించాలి.
  • తలువుల వద్ద గొళ్లాలు, కొక్కాలు, నాబ్ లు , తలుపుల ఉపరితలం వంటి వాటిని తాకుండా జాగ్రత్త వహించాలి.

Next Story