ఇటీవలే విడుదలైన అల వైకుంఠపురములో సినిమా విజయం సాధించడంతో..ఆ చిత్ర బృందం ఇంకా విజయోత్సవ వేడుకల్లోనే మునిగితేలుతున్నాయి. అల్లుఅర్జున్ కూడా తన ఫ్యామిలీతో చిత్రం విజయం సాధించిన సందర్భంగా సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. కాగా..తాజాగా అల్లు అర్జున్ ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడెందుకు చెప్పాడు ? ఇప్పుడప్పుడే టీచర్స్ డే కూడా లేదు కదా అనుకుంటున్నారా ? అతను కృతజ్ఞతలు చెప్పింది..తన కొడుక్కి విద్యాబుద్ధుల్ని నేర్పిన టీచర్లకండి. ఎందుకో తెలుసా..తన కొడుకుకు ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందట. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ లో ఇలా రాసుకొచ్చాడు.

Also Read : కరోనాపై స్పందించిన జక్కన్న

”అయాన్ మంచి విద్యాబుద్దులు నేర్చుకోవడంలో సహరిస్తున్న బోధీ స్కూల్ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తన కొడుకు విద్యకు ఈ స్యూల్‌ను సెలెక్ట్ చేసుకున్నందకు తల్లితండ్రులుగా మేం చాలా సంతోషిస్తున్నాం. అయాన్ ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఎప్పటికీ తీపి జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుంటాం” అని పేర్కొన్నాడు బన్నీ.

Also Read : జుట్టు రాలే సమస్యకు చెక్..ఈ 10 చిట్కాలు మీ కోసమే

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా కలవరపెడుతుండటంతో..అన్ని సినిమాల షూటింగ్ లను రద్దు చేసుకోవాల్సిందిగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా..ఇంకా సినిమా పేరు ఖరారవ్వలేదు. శేషాచలం అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.