అందమైన రిసార్ట్..అందులో హనీమూన్ జంట..ఇంతలోనే షాక్

By రాణి  Published on  14 March 2020 10:08 AM GMT
అందమైన రిసార్ట్..అందులో హనీమూన్ జంట..ఇంతలోనే షాక్

పెళ్లి చేసుకున్నాక ఏ జంటైనా హనీమూన్ ట్రిప్ కు వెళ్లడం కామన్. ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాల్లో పెళ్లిళ్లు జరిగినా..వారి స్తోమతకు తగ్గట్లుగా ఏదొక ప్రాంతానికి హనీమూన్ కి వెళ్తుంటారు. ఇలాగే సౌతాఫ్రికా లోని వైల్డ్ థీమ్ రిసార్టుకు వెళ్లిందో జంట. చుట్టూ అడవి, అందమైన జలపాతం..ఆ జలపాతం ఒడ్డున కాటేజీలతో ఉంటుంది ఆ రిసార్ట్. నిజంగా హనీమూన్ జంటలకే కాదు..ప్రకృతి ప్రేమికులకు కూడా చాలా నచ్చుతుంది.

Also Read : ప్రేమించాడు..పెళ్లి చేసుకుంటానన్నాడు..దొరికింది ఛాన్స్

కాగా..అమెరికా నుంచి సౌత్ ఆఫ్రికాకు వచ్చిన ఆ హానీమూన్ జంటకు ఊహించని అనుభూతి ఎదురైంది. కాటేజీల్లో ఓ కాటేజీని అద్దెకు తీసుకున్నారు. అలా ఫ్రెష్ అప్ అయ్యారో లేదో..రాసక్రీడలు మొదలు పెట్టారు. అలా అలా శృంగారంలోకి జారుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ..అంతలోనే దుప్పటిలో నుంచి అనుకోని అతిథి బయటికి వచ్చాడు. మనిషి కాదు..పాము. దానిని చూసిన వారిద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే రిసార్ట్ మేనేజ్ మెంట్ కు ఫోన్ చేయగా..సిబ్బంది వచ్చి వలవేసి దానిని పట్టుకున్నారు. ఆ వెంటనే భయంతో వణికిపోయిన ఆ జంట కాటేజీ ఖాళీ చేసి వెళ్లిపోయారు.

Also Read : చైనా నుంచి కర్నూలుకు..అన్నెం జ్యోతి

Next Story