ప్రేమించాడు..పెళ్లి చేసుకుంటానన్నాడు..దొరికింది ఛాన్స్

తమిళనాడులోని తిరువారూర్ లో వ్యవసాయ కూలీలు చేసుకుంటూ కూతురిని చదివించుకుంటున్నారు ఆ దంపతులు. కూతురు ఇంటర్మీడియట్ చదువుతోంది. అంతా సాఫీగానే సాగిపోతున్న సమయంలో..ఓ రోజు సడన్ గా కడుపులో నొప్పి అంటూ కూతురు ఏడుస్తుండటంతో..ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ యువతిని పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చారు. విషయం విన్న తల్లిదండ్రులు ఖంగుతిన్నారు. కూతుర్నేమీ అనలేక మిన్నకుండి..ఇంటికొచ్చాక నిదానంగా అసలు జరిగిన విషయం చెప్పమని అడగడంతో..ఉండబట్టలేక అంతా చెప్పేసింది ఆ యువతి. యువతి చెప్పిన వివరాలతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు.

Also Read : ప్రాణం తీసిన శృంగారం

వివరాల్లోకి వెళ్లే..తిరువారూర్ లో ఆ కుటుంబం ఉండే ఇంటికి ఎదురుగానే జాన్సన్ అనే యువకుడు ఉండేవాడు. అతనొక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. అప్పుడప్పుడూ జాన్సన్ కలిసేందుకు వచ్చేవాడు కార్తీక్. ఓ రోజు బాధిత యువతి పై కార్తీక్ కన్నుపడింది. వెంటనే జాన్సన్ ను..అంత అందంగా ఉంది..నువ్వేమైనా ప్రేమిస్తున్నావా అని అడుగగా..లేదని చెప్పాడు. అయితే నేను ట్రై చేసుకుంటా అని చెప్పి..రోజూ ఆమె కాలేజికి వెళ్లే సమయంలో వెంటపడేవాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. నిజమేననుకుని అతడి మాయలో పడిపోయింది. కొద్దిరోజులకే యువతిని కార్తీక్ తన రూమ్ కు తీసుకెళ్లాడు. అక్కడ కూల్ డ్రింక్ తాగమని ఇచ్చాడు.

Also Read : ముగ్గురు పసిపిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..

నమ్మింది..కదా ఏ అనుమానం లేకుండా తాగేసింది. అందులోనే కార్తీక్ మత్తుమందు కలపడంతో ఆ యువతి నిద్రలోకి జారుకుంది. దొరికింది..ఛాన్స్ అనుకుని ఆమె పై అత్యాచారం చేశాడు. ఆమెకు మెలకువ వచ్చాక కంగారు పడుతుంటే..భయపడొద్దు నేను పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు. ఈ విషయాన్నంతటినీ జాన్సన్, విశ్వరాజ్ లకు కూడా చెప్పాడు కార్తీక్. మాకూ ఓ ఛాన్స్ ఇవ్వమని వాళ్లు అడగడంతో మరీ ప్లాన్ చేసి యువతిని రూమ్ తీసుకెళ్లాడు. సేమ్ సీన్ రిపీట్. కాకపోతే ఈసారి ముగ్గురు ఆ యువతిపై అత్యాచారం చేశారు. మళ్లీ సేమ్ డైలాగ్ పెళ్లి చేసుకుంటా అని. నమ్మేసింది. అలా నాలుగు నెలల ఆ అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేస్తూనే ఉన్నారు. చేసిన పాపం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా..కడుపు రూపంలో బయటపడింది. పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకున్న జాన్సన్, విశ్వరాజ్ పరారీలో ఉండగా..కార్తీక్ కటకటాలపాలయ్యాడు.

Also Read : రక్షణ పాఠాలు నేర్పాల్సిన వాడే..లైంగిక వేధింపులకు పాల్పడితే..

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *