17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్
By సుభాష్ Published on 14 Sept 2020 3:41 PM ISTదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తూనే ఉంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు కరోనా ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. తాజాగా 17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్ తేలింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా 13న లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, వీరిలో 17 మంది వైరస్ బారిన పడినట్లు స్పష్టమైంది. అయితే పాజిటివ్ వచ్చిన వారిలో బీజేపీకి చెందిన 12 మంది సభ్యులుండగా, వైసీపీకి చెందిన ఇద్దరు, డీఎంకే, ఆర్‌ఎల్‌పీ పార్టీలకు చెందిన ఒక్కొక్కరున్నారు.
వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీల్లో అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఉన్నారు. కాగా, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభ్యులందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి అని తెలుపడంతో తెలుపడంతో ఈ పరీక్షలు నిర్వహించారు. కాగా, భారత్‌లో కూడా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,78,500 కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 92,071 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 1,136 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 48,46,428కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 79,722కు చేరింది. దేశంలో రికవరీ రేటు 78 శాతం ఉండగా, మరణాల రేటు 1.64కు చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు 28,90,2,170 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో 9 ,22,735 మంది మృతి చెందారు. అలాగే 65,19,555 కేసుల, 1,94,273 మరణాలతో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో భారత్ ఉంది.