కరోనా వచ్చినా వదలని టిక్‌టాక్‌ పిచ్చి

By అంజి  Published on  2 April 2020 7:58 AM IST
కరోనా వచ్చినా వదలని టిక్‌టాక్‌ పిచ్చి

తమిళనాడు: కొందరికి టిక్‌టాక్‌ పిచ్చి బాగా ముదిరిపోయింది. అది ఎంతలా అంటే.. చావు బతుకుల మధ్య పోరాడుతున్న టిక్‌టాక్‌ను వదలనంతగా. ప్రాణం పోయిన ఫర్వాలేదు.. కానీ అప్పటి వరకు ఫాలోవర్లు తగ్గకూడదు అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్నామన్న విషయాన్ని మరిచి టిక్‌టాక్‌ వీడియో చేసింది ఓ బాధితురాలు. ఈ ఘటన అరియలూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. కరోనా సోకిన ఆమెను వైద్యులు ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. అయితే ఐసోలేషన్‌ వార్డులోకి మొబైల్‌ అనుమతి లేదు. ఆస్పత్రిలోని శానిటైజేషన్‌ సిబ్బంది సహకారంతో ఆమె ఓ టిక్‌టాక్‌ వీడియోను చేసింది. ఆ తర్వాత శానిటైజేషన్‌ సిబ్బందితో సెల్ఫీ దిగింది. అది గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ మహిళకు సహకరించిన ముగ్గురు శానిటైజేషన్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.

Also Read: భారత్‌లో 10 కరోనా హాట్‌స్పాట్లు ఇవే..!

కరోనా బాధిత మహిళ పట్టుబడడంతోనే మొబైల్‌ ఇచ్చామని శానిటైజేషన్‌ సిబ్బంది తెలిపారు. శానిటైజేషన్‌ సిబ్బందిని వైద్యులు క్వారంటైన్‌కు తరలించారు. తనను ఫాలోవర్లు మరిచిపోకూడదనే ఇలా వీడియో చేశానని కరోనా బాధితురాలు పేర్కొంది. ఆ మహిళ తన టిక్‌టాక్‌ వీడియోలో మాట్లాడుతూ.. ఒంటరిగా ఉండటం బాగోలేదని.. ఫ్యాన్స్‌ని మిస్‌ అవుతున్నానని పేర్కొంది. దగ్గు, గొంతు నొప్పి కారణంగా ఏమీ తినలేకపోతున్నానని, మాట్లాడలేకపోతున్నాని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా బాధితురాలు చెన్నూలోని ఓ షాపింగ్‌ మాల్‌లో పని చేస్తోంది. ఖాళీ సమయం దొరికినప్పుడు టిక్‌టాక్‌ వీడియోలతో కాలక్షేపం చేసేది.

Also Read: తెలంగాణలో తొమ్మిదికి చేరిన కరోనా మరణాలు..

Next Story