కరోనా నెగిటివ్‌తో డిశ్చార్జ్ అయిన వ్యక్తి మృతి
By Newsmeter.Network Published on 8 April 2020 10:10 AM GMTకరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. భారత్‌లోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ భారిన పడి ఇప్పటికే 5, 194 మంది చికిత్స పొందుతుండగా.. 149 మంది మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్‌పై ముందే రణం మోగించిన కేంద్రం మార్చి 24న లాక్‌డౌన్‌ను విధిచింది. ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 14 తరువాత పరిస్థితులను బట్టి లాక్‌డౌన్ గడువును ఈనెలాఖరు వరకు పొడగించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలాఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కర్ణాటకలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 181కు చేరింది. భారత్ దేశంలో మొదట్లో పాజిటివ్ కేసుల సంఖ్య కర్ణాటకలోనే ఎక్కువగా ఉండేవి. కల్బుర్గిలో దేశంలోనే తొలిసారి కరోనా పాజిటివ్ వ్యక్తి మరణించారు.
Also Read :డబ్ల్యూహెచ్‌వో మమ్మల్ని మోసంచేసింది.. నిధులు నిలిపివేస్తాం – ట్రంప్
దీంతో కల్బుర్గి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. తాజాగా ఇప్పుడు ఇదే పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లిన 60ఏళ్ల వ్యక్తి మరణించాడు. కరోనా నెగిటివ్ వచ్చిన వ్యక్తి మరణించడంతో కల్బుర్గిలో కలకలం రేగింది. కర్ణాటకలో నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ అయిన పేషంట్లు ఎలా ఉన్నారు అనేదానిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. వారి ఆరోగ్యంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి మృతిలో కల్బర్గిలో హై అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చనిపోయిన వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడని, కరోనాతో అతడు మృతిచెందలేదని, ఇతర సమస్యలతో బాధపడుతు అతను మృతి చెంది ఉంటాడని వైద్యులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి కరోనా నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ అయిన వ్యక్తి మృతిచెందటం అందరిలోనూ ఆందోళనకు గురిచేస్తుంది.