ఉద్యోగాలు ఊడుతున్నాయి.. మీడియాపై లాక్‌డౌన్ ఎఫెక్ట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 April 2020 8:18 PM IST
ఉద్యోగాలు ఊడుతున్నాయి.. మీడియాపై లాక్‌డౌన్ ఎఫెక్ట్..!

లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే ఎన్నో కంపెనీలు మూతబడుతూ ఉన్నాయి. చాలా మందిని ఉద్యోగాల నుండి తీసివేస్తున్నాయి కంపెనీలు..! శాలరీలు తగ్గించుకోగలిగితే ఉండాలని.. లేదంటే రాజీనామా అయినా చేయొచ్చని చెబుతున్నాయి.. ప్రముఖ కంపెనీలు. ఇప్పటికే చాలా మందిని శెలవుల మీద వెళ్లిపోమని కొన్ని మీడియా సంస్థలు కోరాయి. అది కూడా శాలరీ ఇవ్వకుండానే..! ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమను ఉద్యోగాల్లో నుండి తీసేస్తున్నారని పలువురు ఉద్యోగులు సోషల్ మీడియాలో వాపోతున్నారు.

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ లీవ్ మీద వెళ్లాలంటూ బ్లూమ్ బర్గ్ క్విన్ట్ కు చెందిన 30 మంది ఉద్యోగులకు తెలిపారు. సండే మ్యాగజైన్ లకు చెందిన ఉద్యోగులను కూడా తీసివేస్తున్నారని.. సంస్థతో ఎన్ని సంవత్సరాల అనుబంధం ఉన్నా కూడా పట్టించుకోలేదని.. తీసేస్తున్నారని చెబుతున్నారు ఉద్యోగులు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని.. మీరందరూ కొద్దిరోజుల పాటూ లీవ్ తీసుకోవాలని.. ఈ సమయంలో ఎటువంటి శాలరీ కూడా ఇవ్వమని సదరు ఉద్యోగులకు ఈమెయిల్స్ వెళ్లాయట. కేవలం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15 వరకూ మాత్రమే శాలరీ ఇవ్వగలుగుతున్నామని.. అది కూడా త్వరలోనే ఇస్తామని తెలిపారు. ఈపిఎఫ్ నుండి డబ్బు తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు హెచ్.ఆర్.తో మాట్లాడాలని సూచించారు. రాబోయే మూడు నాలుగు నెలల్లో సంస్థకు ఆదాయం అన్నది రావడం చాలా కష్టమేనని.. దయచేసి పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులంతా నిరుత్సాహ పడకూడదని.. తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు.



హిందుస్థాన్ టైమ్స్ మరాఠీకి చెందిన ఉద్యోగులను కూడా ఏప్రిల్ 30 తర్వాత రావద్దని చెప్పారని ప్రముఖ జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లే ట్వీట్ చేశారు.

Next Story