దేశ వ్యాప్తంగా పడిపోయిన మహమ్మారి వైరస్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Jun 2020 3:07 PM GMT
దేశ వ్యాప్తంగా పడిపోయిన మహమ్మారి వైరస్

కరోనా వైైరస్.. ఓ దశ వరకూ నెటిజన్లు గూగుల్ చేసిన అత్యంత ఆసక్తికరమైన డేంజరస్ వైరస్ ఇది. ఈ వైరస్ గురించి తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్ ఇంజన్ లో సెర్చ్ చేసి చేసి అలసిపోయిన నెటిజన్లు ఇప్పుడిప్పుడే దేశంలోని మిగతా విషయాలపై దృష్టి మళ్లిస్తున్నారు. గూగుల్ సెర్చ్ లో దాదాపు రెండు నెలల పాటు టాప్ ప్లేస్ లో ఉన్న కరోనా వైరస్ ఉన్నట్లుండి సగానికి పైగా తగ్గిపోయింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తొలి దశలో ఆ వైరస్ సోకితే బ్రతకటం కష్టమేనన్న కథనాలు వెలువడటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో కరోనా లక్షణాలు, కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ? రోగ నిరోధక శక్తితో కరోనాని ఎలా జయించవచ్చు ? ఇలా సంబంధిత విషయాలపై సెర్చ్ చేసిన నెటిజన్లకు ఇప్పుడు బొత్తిగా..కరోనా అంటే అణువంత కూడా భయం లేకుండా పోయింది.

తాజాగా గూగుల్ ట్రెండ్స్ లో నెటిజన్లు కరోనా గురించి పెద్దగా సెర్చ్ చేయట్లేదని విషయం తేటతెల్లమైంది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో నెటిజన్లు ఎక్కువగా కొత్త సినిమాలు, వాతావరణం అప్ డేట్స్ వంటి విషయాల గురించి ఎక్కువగా వెతికినట్లు గూగుల్ పేర్కొంది. దీంతో కరోనా వాల్యూమ్ ఏకంగా 12కు పడిపోగా..ఇది లాక్ డౌన్ కు ముందున్న పరిస్థితిని తలపిస్తోందని గూగుల్ తెలిపింది.

Next Story