వణికిస్తున్న కరోనా.. అక్కడ ఒక్కరోజే 2129 మరణాలు
By న్యూస్‌మీటర్ తెలుగు
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణికిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్‌కు లక్షలమంది బాధితులు కాగా.. వేలల్లో ప్రాణాలు గాల్లో కలిసాయి. ఇక మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2129 మంది ఈ వైరస్ సోకి బలవగా.. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 26వేలు దాటింది. అయితే ఈ మరణాల్లో.. అమెరికా ప్రధాన రాష్ట్రమైన న్యూయార్క్‌లో ఎక్కువ సంభవించాయని అంటున్నారు. ఇప్పటివరకూ ఒక్క న్యూయార్క్‌లోనే 10,367 మంది ప్రణాలు కోల్పోయారంటూ వార్లు వస్తున్నాయి.
అయితే.. న్యూయార్క్ ఆరోగ్య కమిషనర్ ఆక్సిరిస్ బార్బోట్ స్పందిస్తూ.. న్యూయార్క్‌లో మంగళవారం నాటికి 6,589 మంది మాత్రమే మృతి చెందారని చెబుతోంది. మిగతా 3,778 మంది కోవిడ్-19.. లేదంటే మరో వ్యాధి కారణంగా మరో మృతి చెందారని.. వారిని ఈ లెక్కల్లో కలపలేదని.. వారిని కూడా కలిపితే మృతుల సంఖ్య పదివేలు దాటుతుందన్నారు.
ఇక న్యూయార్క్‌లో కరోనా వలన ఏర్పడిన సంక్షోభం గురించి మేయర్ బిల్ డి బ్లాసియో మాట్లాడుతూ.. దాదాపు రూ. 76 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఏదేమైనా టెక్నాలజీ పరంగానే కాకుండా అన్ని రంగాలలో విశేషమైన అబివృద్ది చెందిన అమెరికా లాంటి దేశంలోనే ఇటువంటి పరిస్థితులుంటే.. కనీస సౌకర్యాలు లేని దేశాల పరిస్థితేంటని నిపుణులు వాపోతున్నారు.