ఫైర్ క్రాకర్స్ తో హైదరాబాద్‌లో కమ్ముకున్న కాలుష్యం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Oct 2019 11:37 AM ISTదీపావళి వేడుకల అనంతరం జంట నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగింది. సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన ఎయిర్ మానిటరింగ్ స్టేషన్ లో గరిష్టంగా 720 ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) వద్ద 2.5 పీఎం (పార్టిక్యులేట్ మాటర్ ) వాయుకాలుష్య తీవ్రత నమోదైంది. దీనిని హైదరాబాద్ లోని యుఎస్ దౌత్య కార్యాలయానికి సమీపంలో ఉన్న కేంద్రం పర్యవేక్షిస్తుంది. దీపావళి ఒక్కరోజులోనే సాయంత్రం నుండి రాత్రి వరకు గరిష్టంగా 462 ఏక్యూఐ ని 2.5 పీఎం నమోదు అయ్యింది. చివరికి దీపావళి తరువాత హైదరాబాద్ వాయువు కాలుష్యం పెరిగి గాలి ప్రజలకు ప్రమాదకరంగా మారింది. 2.5 పీఎం ఇది వాయు కాలుష్య కారక రేణువులను సూచిస్తుంది. దీనివలన ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయాని.. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ చీఫ్ సైంటిస్ట్, కాలుష్య విశ్లేషకుడు కె. బాబురావు మాట్లాడుతూ, నగరంలో వాయు కాలుష్య తీవ్రత స్థాయి ఒక రోజు అధికంగా ఉన్నప్పటికీ చాలా భయంకరంగా ఉంటుందన్నారు. దీపావళి సందర్భంగా గాలి నాణ్యత తగ్గడం సహజం. దుమ్ము, ధూళి కణాలతోపాటు ఇతర లోహాల రేణువులు గాలిలో చేరడంతో ఆనేక రసాయనాలతో వాయు కలుషితం అవుతుందని తెలిపారు. ఈ రసాయనాలు వాతావరణంలోకి వాతావరణం ఎక్కువగా కలుషితం అవుతుందని అన్నారు.
ఢిల్లీలో గత కొన్ని వారాలుగా గాలి నాణ్యత క్షీణించి.. వాయు కాలుష్యంతో ప్రజలు బాధపడుతున్నారు. దీపావళి తరువాత సోమవారం ఉదయం 11.30కి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి అందిన సమాచారం ప్రకారం 348 వద్దకు చేరుకున్నట్లు సమాచారం. అయితే మరో పర్యావరణ నిపుణుడు ఢిల్లీలో వాయు కాలుష్యానికి అనేక ఇతర అంశాలను దోహదపుతున్నాయినని, హైదరాబాద్ కాలుష్యం వేరే వేరే కారణాలు ఉన్నప్పటికీ, దీనిపై అధ్యాయనం చేయాలిసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీపావళి వంటి ప్రత్యేక రోజుల్లో మాత్రమే చర్చించకుండా, గాలి నాణ్యత స్థాయి వాయు కాలుష్యాన్ని నిరంతరంగా తనిఖీ చేయాలన్నారు. పర్యావరణ విశ్లేషకుడు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి చైర్మన్ డబ్ల్యుజి ప్రసన్న కుమార్ అన్నారు. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే, ఇది మొత్తం గాలి నాణ్య ప్రమాణంలో తేడాలు గుర్తించవచ్చాన్నారు.