సీజ్ చేసిన లిక్కర్‌తో స్టేషన్‌లో పార్టీ.. అడ్డంగా బుక్కైన కానిస్టేబుళ్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 July 2020 8:55 AM GMT
సీజ్ చేసిన లిక్కర్‌తో స్టేషన్‌లో పార్టీ.. అడ్డంగా బుక్కైన కానిస్టేబుళ్లు

అనంత‌పురం జిల్లా హిందుపురంలో ఇద్దరు కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్‌లో మద్యం తాగి అడ్డంగా దొరికిపోయారు. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కర్ణాటక నుండి వచ్చిన అక్రమ మద్యాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అయితే ఆ మ‌ద్యాన్ని పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుళ్లు నూర్‌ మహ్మద్, తిరుమలేశ్ దర్జాగా కూర్చొని మద్యం సేవించారు.

హిందూపురం కంటోన్మెంట్ జోన్ కావ‌డం వల్ల మద్యం ప్రియులకు మద్యం లేక తల్లడిల్లి పోతుంటే.. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మాత్రం కానిస్టేబుళ్లు సీజ్ చేసిన‌ మద్యంతో పండుగ చేసుకుంటున్నారు. సీజ్‌ మద్యం బాటిళ్లను చూసిన ఖాకీలకు నాలుక లాగిందో ఏమో పోలీస్ స్టేషన్ అన్న విషయం కూడా మర్చిపోయి తాగేశారు. తాజాగా దానికి సంబంధించిన వీడియో బ‌యటికి రావటంతో ఖాకీల‌ నిర్వాకం బ‌ట్ట‌బ‌య‌లైంది.

Next Story
Share it