బాబు నివాసం వద్ద బందోబస్తు నిర్వహించిన కానిస్టేబుల్‌కు కరోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2020 5:59 AM GMT
బాబు నివాసం వద్ద బందోబస్తు నిర్వహించిన కానిస్టేబుల్‌కు కరోనా

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి నివాసం వద్ద బందోబస్తు విధుల్లో పాల్గొన్న కానిస్టేబుల్‌ కు కరోనా వైరస్‌ సోకింది. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసం వద్ద ఇటీవల అతను విధులు నిర్వహించాడు. అనంతరం గుంటూరు జిల్లా బాపట్లకు వెళ్లాడు.

బాపట్లకు చెందిన కానిస్టేబుల్‌ విధుల నిమిత్తం గత నెల 5న హైదరాబాద్‌కు వెళ్లి జూన్‌ 7న తిరిగి బాపట్లకు వచ్చాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించారు. శనివారం వచ్చిన ఫలితాల్లో అతడికి వైరస్‌ సోకినట్లు తేలింది. హైదరాబాద్‌లో బాబు నివాసం వద్ద విధులు నిర్వహించే సమయంలో తోటి కానిస్టేబుల్‌ నుంచి అతడికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.

Next Story
Share it