జేసీ ప్రభాకర్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

By సుభాష్  Published on  13 Jun 2020 12:49 PM GMT
జేసీ ప్రభాకర్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

దివాకర్‌ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో అరెస్ట్‌ అయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. అనంతరం పోలీసులు వారిద్దరినీ అనంతపురం జైలుకు తరలించారు. అంతకు ముందు ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌ రెడ్డికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో హాజరు పరిచారు.

మరో వైపు ప్రభాకర్‌ రెడ్డి వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసిన ఆయనను అనంతపురం పోలీస్‌ స్టేషన్‌లో మూడు గంటల పాటు విచారించారు. ఈ నేపథ్యంలో కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జేసీ అనుచరులు స్టేషన్‌కు చేరుకోగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, 154 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్‌ఓసీలు సష్టించడం, బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌-4 గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు జరిపినట్లు విచారణ తేలిన కేసులో వారిద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపగా, నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటి వరకూ 154 వహనాలను నాగాలాండ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు తేలింది.

Next Story
Share it