ఏపీలో మరో 186 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2020 7:57 AM GMT
ఏపీలో మరో 186 కేసులు

ఏపీలో క‌రోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 14,477 సాంపిల్స్ ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా మ‌రో 186 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4588 కి చేరింది. కొవిడ్‌ వల్ల కృష్ణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. ఈ మ‌హ‌మ్మారి వల్ల ఇప్పటి వరకు 82 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,641మంది డిశ్చార్జి కాగా.. 1865మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Untitled 3 Copy

Next Story
Share it