లాఠీతో ఎస్సైని కొట్టిన కానిస్టేబుల్‌.. వీడియో వైరల్

By సుభాష్  Published on  22 April 2020 10:15 AM GMT
లాఠీతో ఎస్సైని కొట్టిన కానిస్టేబుల్‌.. వీడియో వైరల్

పైస్థాయి ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులను మందలించడం మామూలే. ఇది ఏ కార్యాలయంలోనైనా జరిగేదే. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో కింది స్థాయి ఉద్యోగులను పైస్థాయి ఉద్యోగులు సూచనలు, సలహాలు చేయడం, అలాగే మందలించడం లాంటివి జరుగుతుంటాయి. ఇక కింది స్థాయి ఉద్యోగులు కూడా పైస్థాయి ఉద్యోగులకు గౌరవం ఇవ్వడం అనేది సర్వసాధారణం. ఇవి పోలీసుశాఖలో గానీ, ఇతర శాఖలో గానీ ఖచ్చితంగా ఉంటుంది. దీంతో కింది స్థాయి ఉద్యోగులు పైస్థాయి ఉద్యోగులను ఏమి ఎదురు చెప్పకూడదు. సమాధానం మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కింది స్థాయి ఉద్యోగి.. పైస్థాయి ఉద్యోగిపైనే తిరగబడిపోయాడు. అంతేకాదు లాఠీతో కొట్టేశాడు కూడా. నడి రోడ్డుపైనే ఓ ఎస్సైని హెడ్‌కానిస్టేబుల్‌ లాఠీతో కొట్టడం తీవ్ర సంచలనంగా మారింది.

Constable Fight With Si

అయితే పోలీసులు సామాన్యులను గానీ, ఏదైనా కేసులో తప్పు చేస్తే కొట్టడం అనేది చూస్తూనే ఉంటాం. కానీ పోలీసుశాఖలో కానిస్టేబుల్‌ ఎస్సైని కొట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఏకంగా ఎస్సైనే లాఠీతో కొట్టాడు. సీతాపూర్‌ జిల్లా కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న రామశరాయ్‌ అనే హెడ్‌ కానిస్టేబుల్‌ కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా తనిఖీలు సరిగ్గా చేయడం లేదని సీనియర్‌ సబ్‌ ఇన్సెపెక్టర్‌ రమేష్‌ కానిస్టేబుల్‌ను మందలించాడు. దీంతో ఆగ్రహించిన హెడ్‌ కానిస్టేబుల్‌ రామశరాయ్‌ లాఠీతో రమేష్‌ను కొట్టాడు. లాఠీతో ఎస్సైని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో స్పందించిన సితాపూర్‌ జిల్లా ఎస్పీ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

[video width="480" height="848" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/WhatsApp-Video-2020-04-22-at-3.50.34-PM.mp4"][/video]

Next Story