తెలంగాణలోని భద్రాది కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బు గూడెం గ్రామంలో పరదాల పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సుమారు 20 ఇళ్లకు భారీగా మంటలు వ్యాపించాయి.

భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో గ్రామమంతా ఆర్తనాదాలతో హోరెత్తిపోయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.  అయితే దాదాపు 20 ఇళ్ల వరకూ మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.