వలస కూలీలకు ఉచితంగా కండోమ్‌లు
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2020 7:49 PM ISTఅవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు బీహార్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇళ్లకు వెలుతున్న వలస కూలీలకు ఉచితంగా కండోమ్‌లను పంపిణీ చేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రం చేరుకున్న వలస కూలీలను 14 రోజులు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉంచింది. ఈ క్వారంటైన్ ముగిసి ఇళ్లకు వెళ్లే వారికి అధికారులు కండోమ్‌లు పంపిణీ చేశారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు రాష్ట్రంలో ఇప్పటివరకు 8.77 లక్షల మంది క్వారంటైన్ ముగించుకుని స్టేట్ హెల్త్ సొసైటీ ఫ్యామిలీ ప్లానింగ్ అధికారి తెలిపారు. బ్లాక్‌లు, జిల్లా కేంద్రాల్లో ఇంకా 5.30 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. అవాంఛిత గర్భధారణ విషయంలో ఇంటికి వెళ్లే ముందు వలస కూలీలకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నామని.. ఇది పూర్తిగా కుటుంబ కోసమనీ.. కోవిడ్-19తో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. క్వారంటైన్ సెంటర్లు ఖాళీ అయ్యేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగనుందన్నారు. కేర్ ఇండియా సంస్థ సహకారంతో ఈ డ్రైవ్ చేపట్టామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ సమయంలో అవాంఛిత గర్భధారణలు జరిగినట్లు వార్తలు వెలువడిని నేపథ్యంలో బిహార్ వైద్యారోగ్యశాఖ ఈ కార్యక్రమం చేపట్టడం గమనార్హం.