క‌రోనా ఎఫెక్టు.. జోరందుకున్న కండోమ్ అమ్మకాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2020 8:49 PM IST
క‌రోనా ఎఫెక్టు.. జోరందుకున్న కండోమ్ అమ్మకాలు

క‌రోనా వైర‌స్(కొవిడ్‌-19) ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. రోజు రోజుకు ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. దీంతో ఈ వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని దేశాలు లాక్‌డౌన్ ను ప్ర‌క‌టించాయి. క‌రోనా నేప‌థ్యంలో మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజులు, వెంటిలేటర్లు కొరత ఏర్పడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే వీటింన్నిటితో పాటు కండోమ్ లకు గిరాకీ పెరిగింద‌ట‌. మునుపెన్నూడూ లేని రీతిలో అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని ఓ ప్రముఖ దిన‌ప‌త్రిక త‌న క‌థ‌నంలో పేర్కొంది.

సాధార‌ణ రోజుల్లో కంటే 25 నుంచి 50 శాతం అమ్మకాలు పెరిగాయని తెలిపింది. దీంతో ఆర్డ‌ర్లు పెంచుతున్నార‌ట రిటైల‌ర్ షాప్‌లు. ‘సాధారణంగా ఒక్కో ప్యాక్‌లో 3 ఉండే దానిని కొనుగోలు చేసే వాళ్లంతా ఒకేసారి 10 నుంచి 20ప్యాకెట్లు తీసుకెళ్లిపోతున్నారు’ అంటున్నారు రిటైలర్లు

ఎప్పుడైతే ష‌ట్‌డౌన్ అవ‌డం మొద‌లైందో అప్ప‌టి నుంచి కండోమ్‌ల అమ్మ‌కాలు జోరుఅందుకున్నాయ‌ట‌. వీటితో పాటు సెక్స్ టాయ్స్ కు విప‌రీత‌మైన ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌. అయితే వాటిని డెలివ‌రీ చేసేందుకు ఏజెంట్లు లేక‌పోడంతో అమ్మ‌కాలు వాయిదా ప‌డుతున్నాయ‌ట‌. ప్రజలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఏం చేస్తున్నా.. కుటుంబ నియంత్రణను మాత్రం మరిచిపోవడం లేదంటున్నారు విశ్లేకులు.

ప్రపంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మ‌రి వ‌ల్ల 19వేల మందికి పైగా మృత్యువాత ప‌డ‌గా.. 4లక్షల 23వేల 660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్ లో 582 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 11మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story