ఏం ఐడియా గురూ..! క్వారంటైన్‌లో ఉన్న పులిహోర బాగానే క‌లిపావుగా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2020 1:54 PM GMT
ఏం ఐడియా గురూ..! క్వారంటైన్‌లో ఉన్న పులిహోర బాగానే క‌లిపావుగా..

క‌రోనా వైర‌స్(కొవిడ్‌-19) రోజు రోజుకు విజృంభిస్తోంది. క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి చాలా దేశాలు ష‌ట్‌డౌన్ ను అమ‌లు చేస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఇదిలా ఉండ‌గా.. ఓ యువ‌కుడు త‌న ఎదురింటి అమ్మాయిని చూసి మ‌న‌సు పారేసుకున్నాడు. కానీ ఏంలాభం అత‌డు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉండ‌డంతో ఆమెతో మాట్లాడడం క‌దర‌దు. అందుకే డ్రోన్ సాయంతో.. ఆ అమ్మాయితో పులిహోర క‌లిపాడు.

అమెరికాకు చెందిన బ్రూక్లీన్ అనే యువకుడు తన ఎదురింటిలో టిక్‌టాక్ వీడియో చేస్తూ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు. రోజు ఆమెతో సైగ‌లు చేసేవాడు. ఎలాగైనా ఆమెతో మాట్లాడాలి అని అనుకున్నాడు. కానీ ఏంలాభం అత‌డు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. దీంతో అత‌నికి ఓ మెరుపు ఆలోచ‌న వ‌చ్చింది.

డ్రోన్ సాయంతో త‌న సెల్‌నెంబ‌ర్ పంపిచాడు. కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయిన తర్వాత తనతో డేటింగ్ వస్తావా? అని ఆ లెటర్‌లో రాశాడు. ఆమె కూడా ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తుందో ఏమో.. అతడికి మెసెజ్ పంపించింది. కాగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరూ ఎలాగో ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు కాబట్టి.. వీరికి ఇక టైమే తెలియదని, ఎన్ని రోజులైనా సరే ఇళ్లల్లో ఉండిపోయి చాటింగులు చేసేసుకుంటారని నెటీజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నాడు. ఇప్పట్లో బయటకు వెళ్లడం సాధ్యం కాదు. వీరు కలవాలంటే ముందు కరోనా మహమ్మారి వదలాలి. అప్పటివరకు వీరు విరహంతో వెయిట్ చేయాల్సిందే.

ఈ సందర్భంగా బ్రూక్లీన్ మాట్లాడుతూ.. ‘‘నేను కిటికీ నుంచి బయటకు చూస్తుంటే ఆ అమ్మాయి మేడ మీద టిక్‌టాక్ వీడియో కోసం డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆమెకు చేయి ఊపి హాయ్ చెప్పా. ఆమె కూడా హాయ్ చెప్పింది. దీంతో లోపలికి వెళ్లి.. ఒక కాగితం ఫోన్ నెంబరు రాసి ఇచ్చాను. ఒక గంట తర్వాత ఆమె నా ఫోన్‌కు రిప్లై పంపింది. ఆ వీడియోను పార్ట్ 2లో చూపిస్తాను’’ అని తెలిపాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 5.5 మిలియన్ మంది వీక్షించారు.Next Story