పెళ్లికాని యువకుడిపై కన్నేసిన ఆంటీ..

అబ్బాయిలు.. ప్రేమ పేరుతో అమ్మాయిల వెంటపడడం వారిని వేదించడం చూస్తూనే ఉంటాం. ఆ అమ్మాయి కాదంటే.. సోషల్‌మీడియా ద్వారా బెదిరింపులకు పాల్పడడం లాంటివి చేస్తుంటారు. మంగళవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఓ రివర్స్‌ కేసు వచ్చింది. పెళ్లికాని యువకుడు.. తనను ఇద్దరు పిల్లల తల్లి లైంగికంగా వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. గతంలో ఇద్దరి మధ్య సంబంధం ఉండేదని.. కొంతకాలం నుంచి విడిపోయామని, తిరిగి సంబంధం కొనసాగించాలని వేధిస్తోందని తెలిపాడు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఓ సంస్థలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడు నివసించే ఇంటి పక్కనే ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఆమె అప్పటికే భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది. ఓ రోజు తన కొడుకు పుట్టిన రోజు అని ఆ యువకుడిని ఆమె ఇంటికి ఆహ్వానించింది. అలా వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. రోజు ఆఫీస్‌ నుంచి రాగానే తన రూమ్‌లో కంటే.. ఆంటీ ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాడు. కొద్దిరోజలు గుట్టుగా సాగింది వీరి వ్యవహారం. అనంతరం వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆ యువకుడు ఆంటీకి దూరంగా ఉంటున్నాడు. అంతేకాక తన మకాంను వేరే ప్రాంతానికి మార్చాడు. తనను దూరం పెట్టాడన్న కక్షతో ఆమె ప్రియుడిపై కక్షగట్టింది. ఆ యువకుడి ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి అదే పేరుతో మరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది. దాంట్లో అసభ్యకర మెసేజ్‌లు, ఫోటోలు పోస్ట్ చేసేది. అతడి బంధువుల ఫోటోలు, వివరాలు సేకరించి వారిపై కూడా అసభ్యకర మెసేజ్‌లు పెట్టేది.

మెదక్‌లో ఉండే ఆ యువకుడి బంధువుపైనా అలాగే అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మెదక్ పోలీసులు ఆ యువకుడిని ప్రశ్నించారు. దీంతో అనుమానం వచ్చి ఆ యువకుడు ఆంటీ ఇంటికి వెళ్లి నిలదీశాడు. తనతో అపైర్‌ కొనసాగిస్తేనే పాస్‌వర్డ్ చెబుతానని లేదంటే.. ఇలాగే పోస్టులు పెడతానంటూ తెగేసి చెప్పింది. తన కోరికలు తీర్చకపోతే నలుగురిలో పరువు తీస్తానని హెచ్చరించింది. విసిగిపోయిన ఆ యువకుడు ఆంటీపై హైదరాబాద్‌ సైబర్ క్రైమ్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. వివాహిత తనను లైంగికంగా వేధిస్తోందని, సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులతో పరువు తీస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *