పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయిని చూడగానే నచ్చేసింది. ఆమెకు కూడా అతడు నచ్చేశాడు. దీంతో పెద్దలు వారిద్దరికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. తొలిరేయి కోసం అ అబ్బాయి కలలు కంటున్నాడు. మరో రెండు రోజుల్లో తొలిరాత్రి. ఆ రాత్రి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. అయితే అప్పడు అతని ఫోన్‌కి కొన్ని ఫోటోలు, వీడియోలు వచ్చాయి. అవి చూసి అతను షాక్‌ అయ్యాడు. అవి తను చేసుకున్న భార్య అశ్లీల ఫోటోలు. వెంటనే తన భార్య దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. ఫోటోలు, వీడియోలు చూపించాడు. అయితు ఆ వధువు అందులో ఉన్నది తాను కాదని, అవి తన మీద కక్షతో ఎవరో మార్ఫింగ్‌ చేసినవని బుకాయించింది. ఏడుస్తూ వెళ్లిపోయింది. ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలో వరుడుకి అర్థం కాలేదు. తరువాత తానే స్వయంగా ఆ నెంబర్‌కు కాల్‌ చేసి నిజాలు తెలుసుకున్నాడు. చివరికి పోలీసులను ఆశ్రయించాడు.

కర్ణాటకలోని బెంగళూరులో నివసిస్తున్న అవినాష్‌(పేరు మార్చాం).. అదే నగరానికి చెందిన వేద(పేరు మార్చాం)ను పెళ్లి చేసుకున్నాడు. 2019 నవంబరు నెలలో వీరి పెళ్లి జరిగింది. తొలి రాత్రికి మంచి ముహూర్తాలు లేవు. డిసెంబరు 15న తొలిరాత్రి నిర్ణయించారు. అప్పటివరకు వధూవరులు కలవకూడదని పెద్దలు చెప్పారు. దీంతో ఎవరి ఇంట్లో వాళ్లే ఉంటున్నారు. నిత్యం ఫోన్‌లో మాట్లాడుకునేవారు. మరో రెండు రోజుల్లో వారి తొలిరాత్రి. అవినాష్‌ మొబైల్‌కు ఓ మెసెజ్‌ వచ్చింది. ఓ వ్యక్తి అవినాష్‌ పేస్‌బుక్‌ మెసేంజర్‌కు వేద నగ్న ఫోటోలు పంపాడు. మొదట ఆ ఫోటోలు చూసిన అవినాష్ అవి మార్పింగ్‌ చేసినవిగా బావించి పట్టించుకోలేదు. ఆ వ్యక్తి ఫోన్‌ చేసినా అలాంటివి నమ్మనని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఈ సారి ఏకంగా ఓ వీడియోను పంపాడు. అది చూసి అవినాష్ నివ్వెరపోయాడు. ఆ వీడియోలో తన భార్య వేద ఆ వీడియో పంపిన వ్యక్తితో కామకలాపాలు సాగిస్తోంది. తన భార్య తనను మోసం చేసిందని గుండె ఆగినంత పనైంది. వెంటనే అవినాష్.. వేద ఇంటికి వెళ్లి ఆమెను నిలదీశాడు. ఆమె బుకాయించడంతో ఫోటోలు, వీడియోలు చూపెట్టాడు. అయినప్పటికి అవి తనవి కాదని మార్ఫింగ్‌ చేశారని గట్టిగా చెప్పింది. దీంతో ఏం చేయాలో అవినాష్‌కు అర్థం కాలేదు. మరో మార్గం లేదని భావించి పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడు చెప్పిన మాటలు విన్న అవినాష్‌ షాకయ్యాడు. వేద, తానూ ఏడేళ్లు ప్రేమలో ఉన్నానని, ఇద్దరు చాలాసార్లు ఏకాంతంగా గడిపామని చెప్పాడు. అతడి ఫోన్లో ఉన్న ఫొటోలు, వీడియోలతోపాటు ఆమెతో జరిపిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను ఆధారాలుగా చూపించాడు. తనని కాకుండా వేరే వ్యక్తిని పెళ్లాడిందనే కోపంతోనే అవన్నీ ఆమె భర్తకు పంపానని చెప్పాడు. తాను మోసపోయానని భావించిన అవినాష్‌.. భార్య సాధనపై హస్సాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వేరే వ్యక్తితో శరీరక సంబంధం ఉన్నా సరే తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని తెలిపాడు. ఈ కేసుపై గత నాలుగు నెలలుగా అవినాష్‌ పోరాడుతున్నాడు.

ఈ విషయం తన అత్తామామలకు కూడా తెలుసునని.. వారు తనను మోసం చేశారని వాపోయాడు. అంత సన్నిహితంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో కాకుండా తనకు ఇచ్చి పెళ్లి చేయడం మోసం కాదా అని ప్రశ్నిస్తున్నాడు. కేసును వెనక్కి తీసుకోవాలని వేద తండ్రి తనని బెదిరిస్తున్నాడని చెప్పాడు. తన భార్య కూడా తనను వేదిస్తోందని.. కేసు వాపసు తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని, తన ఆత్మహత్యకు కారణం అవినాష్ అని లేఖ రాసి చనిపోతానని భయపెడుతోందన్నాడు. కాగా.. ఈ విషయంలో అవినాష్ కు న్యాయం జరుగుతుందో లేదా అనేది సందేహమే. 2018లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. అక్రమ సంబంధాలు నేరంగా కాదనే విషయం తెలిసిందే.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.